Breaking News

జియో సినిమా ఉచితం కాదు.. ఇకపై డబ్బులు కట్టాల్సిందే!

Published on Tue, 04/25/2023 - 18:44

ఐపీఎల్‌ సీజన్‌లో వినియోగదారుల్ని ఉచితంగా అలరిస్తున్న జియో సినిమా ఇకపై మరింత కాస్ట్లీగా మారనుంది. ఐపీఎల్‌ ముగిసిన వెంటనే యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఫ్రీగా జియో సినిమాను వీక్షించిన యూజర్లు డబ్బులు చెల్లించడం చర్చకు దారితీసింది. 

ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసారాలతో ఆదరణ పొందిన జియో సినిమా ఇప్పుడు దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు గట్టిపోటీ ఇవ్వనుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లు మే 28తో ముగియనున్నాయి. ఆలోపే కొత్త కంటెంట్‌ను యాడ్‌ చేసి యూజర్లకు అందించనున్నట్లు రిలయన్స్‌ మీడియా, కంటెంట్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ జ్యోతి దేశ్‌పాండే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

ఈ తరుణంలో జియో సినిమా తన యూజర్లకు డైలీ, గోల్డ్‌, ప్లాటినమ్‌ అంటూ మూడు ప్లాన్‌ లను అందించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఒకరోజు ప్లాన్‌ రూ.29 కాగా, 93 శాతం డిస్కౌంట్‌తో రూ.2కే అందించనున్నట్లు పేర్కొన్నాయి.

ఇక గోల్డ్‌ ప్లాన్‌ రూ.299 కాగా, రూ.99కే పొందవచ్చు. 12 నెలల ప్లాటినమ్‌ ప్లాన్‌ ధర రూ.1199 ఉండగా, దానిని రూ.599కే సొంతం చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో నాలుగు డివైజ్‌లలో వీక్షించడంతో పాటు.. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూసే సమయంలో ఎలాంటి ప్రకటనలు ప్రసారం అవ్వవని తెలుస్తోంది. కాగా, ఈ సరికొత్త ప్లాన్‌లపై జియో స్పందించాల్సి ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)