Breaking News

ట్విటర్‌ డీల్‌.. చైనా పరపతితో ఎలన్‌ మస్క్‌కు పంచ్‌

Published on Tue, 04/26/2022 - 13:59

ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన ఎలన్‌ మస్క్‌.. ఈ అంశం ఇప్పుడు ప్రపంచంలో హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియా దిగ్గజాన్ని సొంతం చేసుకోవడం ద్వారా స్వేచ్ఛా గొంతుక(పోస్టులు) వినిపించే అవకాశం యూజర్లకు కల్పిస్తానంటూ  ఎలన్‌ మస్క్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ భారీ డీల్‌పై ఎలన్‌ మస్క్‌ వ్యాపార ప్రత్యర్థి జెఫ్‌ బెజోస్‌ స్పందించారు. 

అమెజాన్‌ బాస్‌, ప్రపంచంలో రెండో ధనికుడు జెఫ్‌ బెజోస్‌.. ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ కొనుగోలు చేసిన అంశంపై స్పందించారు.  చరకలు అంటిస్తూనే.. ఆ వెంటనే మస్క్‌ను అభినందించినట్లు బెజోస్‌ ట్వీట్లు చేయడం గమనార్హం. ఈ తరుణంలో తెరపైకి ఆయన చైనా ప్రస్తావన తీసుకొచ్చారు. 

► ఇకపై టెస్లాతో పాటు ట్విటర్‌లోనూ చైనా కీలక పాత్ర పోషించబోతుందంటూ అర్థం వచ్చేలా ఓ ట్వీట్‌ చేశారాయన.  ‘‘చైనీస్ ప్రభుత్వం ‘టౌన్‌ స్క్వేర్‌’తో..  ఇప్పుడు పరపతి పొందుతుందా? ఆసక్తికరమైన ప్రశ్న..’’ అంటూ మంగళవారం ఉదయం ఓ ట్వీట్‌ చేశారాయన.

► విషయం ఏంటంటే.. ఆటోమేకింగ్‌ దిగ్గజం టెస్లా.. చైనాలోనే తొలి ఓవర్సీస్‌ ఫ్యాక్టరీ నెలకొల్పింది. తద్వారా అతిపెద్ద మార్కెట్‌ ఆసియా మీద దృష్టిసారించింది.  ఇప్పుడు ట్విటర్‌తోనూ మస్క్‌.. చైనా పరపతిని పెంచుతాడేమో అంటూ పరోక్షంగా విసుర్లు విసిరాడు బెజోస్‌. 

► స్వేచ్ఛా ప్రకటనకు ట్విటర్‌ అనేది డిజిటల్‌ టౌన్‌ స్క్వేర్‌ లాంటిదని ఎలన్‌ మస్క్‌ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బెజోస్‌.. టౌన్‌స్క్వేర్‌ అంటూ సెటైర్‌ వేశాడు. అయితే ప్రశ్న సంధించినట్లే సంధించి.. దానికి సమాధానం ఏమో పాజిటివ్‌గా ఇచ్చాడు బెజోస్‌. 

► నా ఉద్దేశంలో అలా జరగకపోవచ్చు అంటూ సమాధానం ఇచ్చాడు. చైనా-టెస్లాలో ఉన్న సంక్లిష్టత, ట్విటర్‌కు ఉన్న సెన్సార్‌షిప్‌ అడ్డంకులు ఒకటి కాకపోవచ్చంటూ కామెంట్‌ చేశాడు. ఆ వెంటనే.. మస్క్‌ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులను డీల్‌ చేయడంలో దిట్ట అంటూ ప్రశంసలు గుప్పించాడు జెఫ్‌ బెజోస్‌. మొత్తానికి తన అక్కసును వెల్లగక్కినట్లే కక్కి.. మస్క్‌పై ప్రశంసలు గుప్పించాడు బెజోస్‌. దీనిపై మస్క్‌ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.

చదవండి: మస్క్‌ చేతికి ట్విటర్‌! అనిశ్చితిలోకి అడుగు అంటూ..

Videos

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

2026లో గోల్డ్ దూకుడు.. తులం 1,60,000 పక్క ?

31st నైట్ బిర్యానీ తిని వ్యక్తి మృతి.. ఆసుపత్రిలో 16 మంది !

స్విట్జర్లాండ్ లో భారీ పేలుడు

ప్రసాదంలో పురుగులు.. ఆలయాల్లో గజదొంగలు

గంజాయి డాన్ గా ఎదిగిన లేడీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్

గదిలోకి పిలిచి.. నగ్నంగా వీడియోలతో బ్లాక్ మెయిల్

విదేశీ రహస్య ట్రిప్.. బాబు, లోకేష్ లో టెన్షన్..

2026 కొత్త ఏడాది.. కొత్త జోష్.. మందుబాబుల వీరంగం

YSRCP జడ్పీటీసీపై హత్యాయత్నం.. చూస్తుండగానే కర్రలు, రాడ్లతో దాడి

Photos

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)