Breaking News

లక్కీ బాయ్‌.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్‌ అందుకున్నాడు!

Published on Tue, 09/20/2022 - 10:58

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌​స్టాగ్రామ్‌ని వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ కోట్లలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇన్‌స్టా యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ క్రమంలో చాలామంది ఇందులో సమయ గడిపే వారు కూడా ఉన్నారు. అయితే ఓ విద్యార్థి మాత్రం ఇన్‌స్టాని వాడడంతో అందులో బగ్‌ ఉన్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని కంపెనీకి తెలియజేసి లక్షల రివార్డ్‌ గెలుచుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. జైపూర్‌కు చెందిన విద్యార్థి నీరజ్‌ శర్మ.. తన ఫోన్‌లో ఇన్‌స్టా వాడుతుండగా అందులో ఓ బగ్‌ ఉన్నట్లు గుర్తించాడు. అదేంటంటే.. అవతలి యూజర్‌ లాగిన్, పాస్‌వర్డ్‌ లేకుండా అతని ఖాతాలోని ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ థంబ్‌నైల్స్‌ మార్చేందుకు ఈ బగ్‌ అనుమతిస్తోంది. దీంతో శర్మ ఈ విషయాన్ని జనవరిలో కంపెనీకి తెలియజేశాడు. ఇందుకు స్పందనగా.. ఈ బగ్‌కు సంబంధించిన డెమో వీడియోను పంపాలని కంపెనీ శర్మను కోరింది. బగ్‌ ఎలా పనిచేస్తుందనే తెలిపే 5 నిమిషాల డెమో వీడియోని చిత్రీకరించి అతను కంపెనీకి పంపాడు. దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత, ఫేస్‌బుక్ శర్మకి $45,000 రివార్డ్‌ను ప్రకటించింది (అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 38 లక్షలు). అంతేకాకుండా రివార్డ్‌ని నాలుగు నెలలు ఆలస్యం చేసినందుకు కూడా $4500 అంటే రూ.3.6 లక్షలు ఆఫర్ చేసింది.

చదవండి: క్రెడిట్‌,డెబిట్‌ కార్డులపై కీలక నిర్ణయం.. ఆర్బీఐ కొత్త రూల్‌!

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)