థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
వంతెనలు.. అభివృద్ధికి వారధులు
Published on Fri, 04/03/2026 - 11:39
పశ్చిమాసియాలో భీకరపోరు కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను, పశ్చిమ నగరమైన కరాజ్‌తో అనుసంధానిస్తూ సుమారు 136 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్న అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై అమెరికా తాజాగా జరిపిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగానే కాకుండా ఒక దేశ ఆర్థిక వెన్నెముకపై దెబ్బకొట్టే వ్యూహంగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
ఆర్థికాభివృద్ధికి వంతెనలే ప్రాణాధారం
ఏ దేశానికైనా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. వంతెనలు ఇరు ప్రాంతాలను కలపడంతోపాటు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటి వల్ల..
ప్రయాణ దూరాన్ని తగ్గించడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.
పారిశ్రామిక హబ్‌లను నౌకాశ్రయాలతో లేదా మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి.
భారీ వంతెనల నిర్మాణం వల్ల వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.
సరిహద్దు ప్రాంతాలకు సైనిక బలగాలను, సామగ్రిని వేగంగా తరలించడానికి వంతెనలు కీలకం.
దేశ ప్రగతికి నిదర్శనాలు
భారతదేశం కూడా గత దశాబ్ద కాలంలో అద్భుతమైన వంతెనలను నిర్మించి తన ఆర్థిక శక్తిని చాటుకుంది.
అటల్ సేతు: ముంబై - నవీ ముంబైలను కలిపే ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన. ఇది పారిశ్రామిక కారిడార్లకు ఊపిరిపోస్తోంది.
చీనాబ్ వంతెన: జమ్మూ కాశ్మీర్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ఇది వ్యూహాత్మకంగా, పర్యాటక పరంగా భారత్‌కు ఎంతో కీలకం.
ధోలా-సాదియా వంతెన: అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులనే మార్చివేసింది.
నెక్ట్స్ ‘కింగ్ ఫహాద్ కాజ్‌వే’?
ఇరాన్ వంతెనపై దాడి నేపథ్యంలో కింగ్ ఫహాద్ కాజ్‌వే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సౌదీ అరేబియాను బహ్రెయిన్‌తో కలిపే ఈ 25 కిలోమీటర్ల భారీ వంతెన మిడిల్‌ఈస్ట్‌లో అత్యంత కీలకమైన రవాణా మార్గం. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు పెరిగితే ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చనే ఆందోళన నెలకొంది. ఒకవేళ కింగ్ ఫహాద్ కాజ్‌వే వంటి వంతెనలు దెబ్బతింటే గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోతుంది. ఇది ప్రపంచ చమురు సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఇదీ చదవండి: మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు!
Tags : 1