Breaking News

ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీల కంటెంట్‌కు చెక్‌!

Published on Tue, 11/17/2026 - 19:24

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీలతకు దగ్గరగా ఉండే లైంగిక సూచనలతో కూడిన పోస్టులు, హింసాత్మక దృశ్యాలు, అభ్యంతరకరమైన కంటెంట్‌ తగ్గించేందుకు మెటా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా భారతీయ వినియోగదారుల అభిరుచులు, అభిప్రాయాలకు అనుగుణంగా కంటెంట్‌ సిఫార్సుల వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దినట్లు ప్రకటించింది. ఏఐ ఆధారిత సాంకేతికతను మెరుగుపరచడం ద్వారా వినియోగదారులు చూడకూడదనుకునే కంటెంట్‌ను ముందుగానే గుర్తించి వారి ఫీడ్‌లోకి రాకుండా నియంత్రించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని సంస్థ వెల్లడించింది.

ఏఐతో ముందస్తు గుర్తింపు

ఇప్పటివరకు అభ్యంతరకరమైన కంటెంట్‌పై వినియోగదారులు ఫిర్యాదు చేయడం, పోస్టులను దాచడం లేదా నాట్‌ ఇంట్రస్టెడ్‌ ఎంపికను ఉపయోగించిన తర్వాత వాటి ఆధారంగా చర్యలు తీసుకునే విధానానికి ప్రాధాన్యం ఉండేది. అయితే ఇప్పుడు మరింత సామర్థ్యమున్న ఏఐ మోడళ్లను ఉపయోగించి కంటెంట్‌ను ముందుగానే విశ్లేషించే దిశగా మెటా అడుగులు వేస్తోంది. కంటెంట్‌ను వినియోగదారులు రిపోర్ట్‌ చేసే వరకు వేచి చూడకుండా సిఫార్సుల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది సాంకేతిక వ్యవస్థలు పరిశీలిస్తాయి.

అంతేకాకుండా భారతీయ వినియోగదారులు తమకు కనిపించకూడదని భావిస్తున్న కంటెంట్‌ను మరింత సమర్థంగా గుర్తించేలా ప్రత్యేకంగా వ్యవస్థలను మెరుగుపరిచినట్లు మెటా తెలిపింది. ఈ మార్పుల తర్వాత భారత్‌లో వినియోగదారులు తమకు సిఫార్సు చేసిన కంటెంట్‌పై ఫిర్యాదులు చేయాల్సిన అవసరం ఏడాది క్రితంతో పోలిస్తే సుమారు 50 శాతం తగ్గినట్లు సంస్థ పేర్కొంది.

పూర్తిస్థాయి నిషేధం కాదు..

ఇక్కడ వినియోగదారులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో లైంగిక సూచనలు కలిగిన లేదా హింసాత్మక అంశాలున్న ప్రతి పోస్టును మెటా తొలగించడం లేదు. ఈ చర్య ప్రధానంగా వినియోగదారులు అనుసరించని (ఫాలో చేయని) ఖాతాల నుంచి వచ్చే సిఫార్సు కంటెంట్‌కు వర్తిస్తుంది. ముఖ్యంగా రీల్స్‌, ఎక్స్‌ప్లోర్‌, ఫీడ్‌ విభాగాల్లో ఇలాంటి కంటెంట్‌ ప్రదర్శనను తగ్గించనుంది.

టీనేజర్లకు ప్రత్యేక రక్షణ

మైనర్ల ఆన్‌లైన్‌ భద్రతపైనా మెటా ప్రత్యేక దృష్టి సారించింది. భారత్‌లో టీన్‌ అకౌంట్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో 18 ఏళ్లలోపు వినియోగదారులను వయసుకు తగిన కంటెంట్‌ మార్గదర్శకాల ఆధారంగా రూపొందించిన 13+ సెట్టింగ్‌లో ఆటోమేటిక్‌గా ఉంచుతున్నట్లు సంస్థ తెలిపింది. తద్వారా టీనేజర్లకు అనుచితమైన కంటెంట్‌ చేరకుండా అదనపు నియంత్రణలు అమలవుతాయి.

ఇదీ చదవండి: తండ్రికి నోటీసులు పంపిన కూతురు

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)