Breaking News

ఇన్‌స్టాగ్రామ్ డౌన్ - ఫన్నీ పోస్ట్‌లతో చెలరేగిపోతున్న నెటిజన్లు

Published on Fri, 06/09/2023 - 12:12

Instagram Down: మెటా యాజమాన్యంలో ఉన్న 'ఇన్‌స్టాగ్రామ్' (Instagram) మళ్లీ డౌన్ అయింది. ఈ కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయడంలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 56 శాతం మంది వినియోగదారులు ఈ అంతరాయం వల్ల ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయలేకపోయారు.

డౌన్ డిటెక్టర్ నివేదికల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు లాగిన్ అవ్వడం, ఫోటో అండ్ వీడియో షేరింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ డౌన్‌లోడ్ చేయడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను ఎంత మంది ఎదుర్కొన్నారు అనేదాని మీద ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఇది సుమారు 2 లక్షల కంటే ఎక్కువ మంది వినియోగదారులను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ని యాక్సెస్ చేయడంలో ఇబ్బంది పడుతున్నామని  ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూనే ఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కావడం ఇదే మొదటి సారి కాదు. ఈ ఏడాదిలో ఇది రెండవ సారి కావడం గమనార్హం. 2023 మార్చి నెలలో కూడా ఇదే సమస్య ఎదురైంది. అప్పుడు కూడా వేలాదిమంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగించడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఏర్పడిన అంతరాయానికి గల కారణాలను సంస్థ వెల్లడించాల్సి ఉంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)