Breaking News

పారిశ్రామిక దిగ్గజం అశ్విన్‌ డానీ కన్నుమూత

Published on Fri, 09/29/2023 - 01:48

న్యూఢిల్లీ: భారత్‌ పారిశ్రామిక రంగ ప్రముఖులు,  ఏషియన్‌ పెయింట్స్‌ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, మాజీ చైర్మన్‌ అశ్విన్‌ డానీ (81) తుది శ్వాస విడిచారు. 1968 నుండి ఏషియన్‌ పెయింట్స్‌తో డానీకి అనుబంధం ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

కంపెనీలో వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్, నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌తో సహా కంపెనీ బోర్డ్‌లో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. 2018 నుండి 2021 మధ్య డానీ  ఏషియన్‌ పెయింట్స్‌ సంస్థకు, బోర్డ్‌కు చైర్మన్‌గా ఉన్నారు. డానీ తండ్రి సూర్యకాంత్‌ ఏషియన్‌ పెయింట్స్‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు.  వివిధ ప్రభుత్వ– వాణిజ్య సంస్థల్లో డానీ కీలక బాధ్యతలు నిర్వహించారు. పలు అవార్డులు అందుకున్నారు.

సీఎన్‌బీసీ–టీవీ 18 లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, బిజినెస్‌ ఇండియా మ్యాగజైన్‌ బిజినెస్‌మెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (2015), ఇండియన్‌ పెయింట్‌ అసోసియేషన్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు, 2002లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ నుండి కెమినార్‌ అవార్డు ఇందులో ఉన్నాయి. తాజా ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం, అశ్విన్‌ డానీ, ఆయన కుటుంబం 7.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 64,000 కోట్లు) నికర విలువను కలిగి ఉంది. తద్వారా  ప్రపంచవ్యాప్తంగా 293వ స్థానంలో నిలిచారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)