Breaking News

ఇంటర్నెట్‌ నుంచి ఇంటెలిజెన్స్‌ యుగానికి

Published on Fri, 02/20/2026 - 05:10

న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై దేశీ కార్పొరేట్‌ దిగ్గజాలు భారీ దృష్టి సారించాయి. భారత్‌ ‘ఇంటెలిజెన్స్‌ ఎరా’లోకి అడుగుపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేశీయ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా సార్వ¿ౌమత్వం, హైపర్‌ ప్రోగ్రెస్‌ దిశగా ముందుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్‌ టెక్‌ నేతలు పిలుపునిచ్చారు.

 డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్‌ దూసుకెళ్తోందని, స్వదేశీ మౌలిక వసతులు, చౌక డేటా వినియోగంతో ‘ఇంటెలిజెన్స్‌ సెంచరీ’లో గ్లోబల్‌ లీడర్‌గా ఎదగాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిలయన్స్‌ అధినేత అంబానీ, అదానీ గ్రూప్‌ ఈడీ జీత్‌ అదానీ,  గూుగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఏఐ సదస్సులో తెలిపారు.      

మొబైల్, ఇంటర్నెట్‌ తరహాలోనే కృత్రిమ మేధను (ఏఐ) చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు.  ప్రతి పౌరుడు, వ్యాపారం, ప్రభుత్వ సరీ్వసులను ఏఐతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. 

జామ్‌నగర్‌లో గిగావాట్‌ స్థాయి ఏఐ–రెడీ డేటా సెంటర్ల ఏర్పాటు, 10 గిగావాట్ల వరకు హరిత విద్యుదుత్పత్తి, అతి తక్కువ లేటెన్సీతో దేశవ్యాప్తంగా ఏఐని అందించేలా ఎడ్జ్‌–కంప్యూట్‌ వ్యవస్థను నెలకొల్పేందుకు జియో ఇంటెలిజెన్స్‌ ఈ మొత్తాన్ని వెచి్చంచనున్నట్లు వివరించారు. 

డీప్‌టెక్, తయారీ, అసంఘటిత రంగం కోసం ఏఐని అందుబాటులోకి తేవడం, ప్రపంచ స్థాయి బహుభాషా ఏఐని రూపొందించడం, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలాంటి అయిదు మార్గదర్శక సూత్రాల ఆధారంగా జియో ఇంటెలిజెన్స్‌ పని చేస్తుందని చెప్పారు. ‘‘భారత్‌ను జియో ఇంటర్నెట్‌ యుగానికి అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్‌ యుగానికి అనుసంధానం చేస్తుంది. 

జియో, రిలయన్స్‌ కలిసి వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇవేవో స్పెక్యులేటివ్‌ లేదా వేల్యుయేషన్లపరమైన పెట్టుబడులు కావు. రాబోయే అనేక దశాబ్దాల పాటు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. దేశం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే సత్తాను సాధించేందుకు దోహదపడతాయి. డేటా తరహాలోనే ఏఐ ఖర్చుని కూడా మేము గణనీయంగా తగ్గిస్తాం. అద్దె మేధస్సుతో భారత్‌ ముందుకెళ్లలేదు’’ అని అంబానీ స్పష్టం చేశారు.  

ఏఐ వ్యూహానికి 3 కీలకాంశాలు: జీత్‌ అదానీ 
భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఏఐ సరికొత్త నిర్వచనం ఇస్తుందని అదానీ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జీత్‌ అదానీ చెప్పారు. దేశ కృత్రిమ మేథ వ్యూహానికి విద్యుత్, కంప్యూట్‌–క్లౌడ్, సర్వీసులనే మూడు అంశాలు ప్రదానంగా ఉంటాయన్నారు. ‘‘ఏఐని కోడింగ్‌ చేస్తారు. కానీ అది పని చేయాలంటే విద్యుత్‌ భద్రత సాధించడం అవసరం. ఈ విషయంలో పర్యావరణహితమైన విద్యుత్‌ కీలకంగా ఉంటుంది. క్రిటికల్‌ ఏఐ వర్క్‌లోడ్‌లను భారత్‌ స్వదేశంలోనే హోస్ట్‌ చేయాలి. స్టార్టప్‌లు, విద్యా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు అత్యుత్తమ కంప్యూట్‌ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి. 

ఏఐ అనేది ముందుగా దేశ ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. హరిత విద్యుత్‌ ఆధారిత ఏఐ ప్లాట్‌ఫాం ఏర్పాటునకు అదానీ గ్రూప్‌ 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ శతాబ్దంలో భారత్‌ కూడా పాలు పంచుకుంటుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఏఐ సెంచరీలో మౌలిక సదుపాయాలు, మేథస్సు, ప్రమాణాలు, విలు వలపై ఎంత వరకు తన ముద్ర వేస్తుందనేదే ప్రశ్న. కానీ నిస్సందేహంగా భారత్‌ దీన్ని సాధించగలదు’’ అని చెప్పారు.  

హైపర్‌ పురోగతి శకం: గూగుల్‌ సుందర్‌  
హైపర్‌ పురోగతి శకానికి కృత్రిమ మేథ నాంది పలికిందని అమెరికన్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ చెప్పారు. వర్ధమాన దేశాలు నిదానంగా ఉండే సంప్రదాయ వృద్ధి బాటలో కాకుండా ఎకాయెకిన వేగంగా పైకి ఎదిగేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మొదలైన విభాగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందన్నారు. ‘‘ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో నిస్సందేహంగా గణనీయ మార్పులు వస్తాయి. కొన్ని ఆటోమేట్‌ అవుతాయి. మరికొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుంది. పూర్తిగా సరికొత్త కెరియర్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత మార్పులను అందిపుచ్చుకునేలా వర్కర్ల కోసం గూగుల్‌ ఏఐ ప్రొఫెషనల్‌ సరి్టఫికెట్‌ని ప్రవేశపెట్టాం. 10 కోట్ల మందికి డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చాం’’ అని సుందర్‌ చెప్పారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు