Breaking News

విదేశాల నుంచి ఉద్యోగులు.. కంపెనీలకు జీఎస్టీ నోటీసులు

Published on Wed, 10/04/2023 - 13:33

దేశంలోని అనేక కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు రావడం గురించి ఎక్కువగా వింటున్నాం. అయితే కంపెనీలకు ఎందుకిలా వరుసపెట్టి జీఎస్టీ నోటీసులు వస్తున్నాయని పరిశీలిస్తే అసలు కారణం తెలిసింది. 

భారత్‌కు చెందిన చాలా కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలు విదేశాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే విదేశీ సంస్థలు, వాటి అనుబంధ కంపెనీలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఈ కంపెనీలు ఆయా దేశాల్లో ఉద్యోగులను అక్కడి చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నియమించుకుంటాయి. అయితే బయటి దేశాల్లో నియమించుకున్న ఉద్యోగులను భారత్‌కు డిప్యూటేషన్‌పై తెచ్చుకున్న కంపెనీలకు ఇటీవల జీఎస్టీ నోటీసులు అందాయి.
 
బయటి దేశాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన జీతాన్ని తమ విదేశీ సంస్థకు ఇక్కడి కంపెనీలు తిరిగి చెల్లిస్తుంటాయి. ఇలా బయటి దేశాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినవారిని సెకెండెడ్‌ ఎంప్లాయీస్‌ అంటారు. విదేశీ సంస్థకు రియింబర్స్‌ చేసే వీరి జీతాలపై సర్వీస్‌ ట్యాక్స్‌ వర్తిస్తుంది. ఈమేరకు నార్తర్న్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ కేసులో భాగంగా 2022 మేలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అనుసరిస్తూ ఆయా కంపెనీలకు జీఎస్టీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ నోటీసులపై కంపెనీల్లోని ట్యాక్స్‌ నిపుణులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. "2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేసుల మదింపు పరిమితి కాలం సెప్టెంబర్‌తో ముగిసిన నేపథ్యంలో కంపెనీలకు వరుపెట్టి నోటీసులు వచ్చాయి. ఇటువంటి నోటీసులు అందుకున్న కంపెనీలు వాస్తవాలను పరిశీలించుకుని ముందుకు వెళ్లాల్సిఉంటుంది" అని కేపీఎంజీ-ఇండియా, భాగస్వామి, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌ నేషనల్‌ హెడ్‌ అభిషేక్ జైన్ అన్నారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)