Breaking News

భారత్‌లో నిరుద్యోగ రేటు ఇలా..

Published on Tue, 09/09/2025 - 07:39

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ప్రకారం జీ20 కూటమి దేశాల్లో చూస్తే.. భారత్‌లోనే నిరుద్యోగ రేటు అత్యంత కనిష్టంగా 2 శాతం స్థాయిలో ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి 'మన్‌సుఖ్‌ మాండవీయ' తెలిపారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అనుగుణంగా వివిధ రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల కల్పన జరిగిందని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజనలాంటి స్కీములు కూడా ఇందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.

నేషనల్‌ కెరియర్‌ సర్వీస్‌ (ఎన్‌సీఎస్‌) పోర్టల్‌ ద్వారా యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చేందుకు క్లాసిఫైడ్స్‌ ఆన్‌లైన్‌ సైట్‌ ‘క్వికర్‌’, డిజిటల్‌ మెంటార్‌షిప్‌ ప్లాట్‌ఫాం’ మెంటార్‌ టుగెదర్‌’తో కార్మిక శాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఉద్యోగార్థులకు తగిన ఉద్యోగావకాశాలు దక్కేందుకు ఈ భాగస్వామ్యాలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'ఈ రంగాలు లేకుంటే అమెరికాలో ఉద్యోగాలు సున్నా'

మెంటార్‌ టుగెదర్‌ భాగస్వామ్యంతో తొలి ఏడాదిలో 2 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజె తెలిపారు. మరోవైపు క్వికర్‌ జాబ్స్‌ని ఎన్‌సీఎస్‌కి అనుసంధానించడం వల్ల పోర్టల్‌కి ప్రతి రోజూ 1,200 జాబ్‌ లిస్టింగ్‌లు జతవుతాయని పేర్కొన్నారు. ఎన్‌సీఎస్‌ ప్లాట్‌ఫాంలో 52 లక్షల పైగా సంస్థలు, 5.79 కోట్ల ఉద్యోగార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం పోర్టల్‌లో 44 లక్షల పైచిలుకు వేకెన్సీలు అందుబాటులో ఉన్నాయి.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి