Breaking News

అమెరికా, చైనా తరువాత భారత్: నితిన్ గడ్కరీ

Published on Tue, 10/14/2025 - 14:52

భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ దినిదినాభివృద్ది చెందుతోంది. 2014లో రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఈ పరిశ్రమ.. 2025 నాటికి రూ. 22 లక్షల కోట్లకు చేరిందని.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు. పుదుచ్చేరిలో గ్రేడ్ సెపరేటర్, రోడ్ల విస్తరణ పనులు, కొత్త రోడ్డు ప్రాజెక్టుకు పునాది వేసిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. జపాన్‌ను అధిగమించి మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఇండియా అవతరించిందని అన్నారు.

ఆటోమొబైల్ మార్కెట్ పరిమాణం పరంగా అమెరికా, చైనా తర్వాత దేశం ఇప్పుడు మూడవ స్థానంలో ఉంది. ఈ పరిశ్రమ 4.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. ఎగుమతి రంగానికి ఎంతో దోహదపడిందని గడ్కరీ స్పష్టం చేశారు.

దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని, మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల కారణంగా డిసెంబర్ నాటికి ఇది 9 శాతానికి తగ్గుతుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

వివిధ స్థిరమైన పద్ధతులను అవలంబించడం గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణంలో మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 18 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగించామని, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వ్యర్థాలను ప్రోత్సహించాలని మంత్రిత్వ శాఖ ప్రణాళిక వేసిందని అన్నారు.

ఇదీ చదవండి: బేబీ బూమర్లు నష్టపోతారు!: రాబర్ట్ కియోసాకి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)