Breaking News

డీల్‌తో ఎగుమతులకు బూస్ట్‌

Published on Tue, 06/16/2026 - 05:26

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో దాదాపు నాలుగు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ, శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న అమెరికా–ఇరాన్‌ నిర్ణయంతో భారత్‌కి ఊరట లభించనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈసారైనా ఒప్పందం సజావుగా అమలైతే, పశ్చిమాసియాకి భారత్‌ ఎగుమతులు మళ్లీ పుంజుకునేందుకు ఊతం లభిస్తుందని ఎగుమతిదారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దిగుమతి బిల్లుల భారం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయని, రూపాయి స్థిరపడగలదని భావిస్తున్నారు. వెరసి వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని వారు తెలిపారు.

 జూన్‌ 19 స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ‘ దాదాపు 50 శాతం క్రూడాయిల్, సుమారు 70 శాతం వంట గ్యాస్, 90 శాతం ద్రవీకృత సహజ వాయువు దిగుమతుల కోసం పశ్చిమాసియాపై భారత్‌ ఆధారపడుతోంది. అక్కడ ఉద్రిక్తతలతో సరఫరా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో శాంతి ఒప్పందంతో భారత్‌కి తక్షణం ఆర్థికంగా ఊరట లభిస్తుంది. హార్మూజ్‌ జలసంధి తిరిగి తెరుచుకుంటే, ఇంధన మార్కెట్లు స్థిరపడతాయి. చమురు..గ్యాస్‌ ధరలపై ఒత్తిడి తగ్గి రూపాయి బలపడవచ్చు. భారత్‌ వృద్ధి అవకాశాలు మెరుగుపడొచ్చు‘ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు.  

అనిశ్చితికి తెర.. 
శాంతి ఒప్పంద ప్రకటనతో అనిశ్చితి, ఆర్థిక మందగమనం, అనవసర సమస్యలకి తెర పడుతుందని టెక్నోక్రాఫ్ట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపక చైర్మన్‌ శరద్‌ కుమార్‌ సరాఫ్‌ తెలిపారు. ఎగుమతులు ఎగియడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చన్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరా, ధరలు తిరిగి సాధారణ స్థాయికి తిరిగి రావొచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రాల్హన్‌ తెలిపారు. హార్మూజ్‌ మూసివేత వల్ల నౌకలు ఆఫ్రికా చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనితో సముద్ర మార్గంలో రవాణా, నౌకల బీమా వ్యయాలు భారీగా పెరిగిపోవడంతో పాటు డెలివరీల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. హార్మూజ్‌ తెరుచుకుంటే నౌకల రాకపోకలకు కూడా వెసులుబాటు లభిస్తుందని నిపుణులు తెలిపారు.  

ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిరోధించే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఫిబ్రవరి 28న ఆ దేశంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దానితో మార్చిలో భారత్‌ ఎగుమతులు 7 శాతం క్షీణించి అయిదు నెలల కనిష్ట స్థాయి 38.92 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. పశ్చిమాసియాకి ఏకంగా 58 శాతం తగ్గి 3.5 బిలియన్‌ డాలర్లకు క్షీణించాయి. గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతులు 52 శాతం పడిపోయాయి. ఇక ఇంధనాల సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చాలా కాలం తర్వాత పెట్రోల్, డీజిల్‌ రేట్లను ఇటీవల పాక్షికంగా పెంచినప్పటికీ, అంతర్జాతీయంగా ఎగిసిన స్థాయికి తగ్గట్లు పెంచకపోవడంతో ఆదాయ నష్టాలను చవిచూస్తున్నాయి. అవి పూర్తి ఆర్థిక సంవత్సరపు లాభాలకు సరిసమానంగా ఒక్క త్రైమాసికంలోనే నష్టాలు నమోదు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హార్మూజ్‌ జలసంధి తెరుచుకుంటే సరఫరా మెరుగుపడి, ముడి చమురు ధరలు నెమ్మదించవచ్చు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)