Breaking News

భారత్‌లో ఎక్కువ జీతం వారికే.. సర్వేలో వెల్లడైన సంచలన నిజాలు!

Published on Sun, 07/09/2023 - 15:35

ఆధునిక భారతదేశంలో నేడు ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొంతమంది రూ. వేలలో శాలరీ తీసుకుంటున్నారు, మరి కొంత మంది రూ. లక్షల్లో శాలరీలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది నిర్వహించిన ఒక సర్వేలో దేశ ప్రజల సగటు వార్షిక జీతం ఎంత.. జాబితాలో టాప్‌లో ఉన్న నగరం ఏది? హైదరాబాద్, బెంగళూరు ఎక్కడ ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, ఇండియాలో సుమారు 11,570 సర్వేల నుంచి తీసుకున్న డేటా ఆధారంగా ఒక నివేదిక రూపొందించారు. ఇందులో పురుషుల సగటు జీతం రూ. 19,53,055 కాగా.. మహిళలు ఇందులో రూ. 15,16,296 జీతం పొందుతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. మహిళల సరాసరి జీతం పురుషుల కంటే తక్కువ అని స్పష్టమవుతోంది.

మేనేజ్​మెంట్ అండ్ బిజినెస్ వంటి వాటిలో పనిచేస్తున్న వారి జీతాలు బాగా ఉన్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. వీటి తరువాత న్యాయ వృత్తిలో ఉన్న వారు మూడవ స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఆదాయం పరంగా ఎక్స్​పీరియన్స్ అనేది కీలక పాత్ర పోషిస్తోంది. 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారికి జీతాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: నారాయణ మూర్తి లాంటి భర్తకు భార్యగా ఉండటం అంత ఈజీ కాదు!)

నగరాలలో ఎక్కువ జీతం పొందుతున్న జాబితాలో మహారాష్ట్రలోని టైర్ 2 నగరమైన సోలాపూర్ (రూ. 28,10,000) అత్యధిక సగటు వార్షిక వేతన ప్యాకేజీని కలిగి ఉంది. రూ. 21.17 లక్షల వార్షిక వేతనంతో ముంబై రెండో స్థానంలో ఉండగా, రూ. 21.01 లక్షల జీతంతో బెంగళూరు 3వ స్థానంలో నిలిచింది.

(ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!)

సుమారు 59 మంది సీఈఓల జీతాలపై సర్వే నిర్వహించి వారి సగటు వార్షిక జీతం రూ. 60,48,703. దీని ప్రకారం అత్యధిక వేతనం పొందుతున్న వారుగా సీఈఓలు నిలిచారు. ఆ తరువాత డైరెక్టర్లు (రూ. 58,50,925) జనరల్ మేనేజర్లు (రూ. 42,35,740) కంప్యూటర్​ ఆర్కిటెక్ట్​లు (రూ. 33,37,499) ఉన్నారు. రాష్ట్రాల వారీగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలోనూ ఆ తరువాత పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు నిలిచాయి.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)