Breaking News

మా ఐటీ ఉద్యోగులకు మాటిస్తున్నా..

Published on Wed, 08/27/2025 - 16:29

ఐటీ పరిశ్రమలో ఏఐ పేరు చెబితేనే ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. కారణం ఎడాపెడా లేఆఫ్‌లు. ఒక కంపెనీ ఏఐపై దృష్టి పెట్టిందంటేనే ఇక ఆ సంస్థలో మానవ ఉద్యోగాలకు మూడినట్టేనన్న చర్చ సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్‌సీఎల్‌ ఉద్యోగులకు మంచి మాట చెప్పారు ఆ కంపెనీ చైర్‌ పర్సన్‌ రోష్ని నాడార్‌.

ఇటీవల జరిగిన హెచ్‌సీఎల్‌టెక్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్‌పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముడిపడి ఉన్న ఉద్యోగాల కోతలపై పెరుగుతున్న ఆందోళనలను ప్రస్తావించారు. తాము మానవ ప్రతిభను మరింత పెంచడానికే తప్ప దాన్ని భర్తీ చేయడం కోసం ఏఐని వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ఆ రకంగా ఉద్యోగాల తొలగింపు కాకుండా వాటి సృష్టిపై కంపెనీ దృష్టి సారించిందని ఆమె వాటాదారులకు భరోసా ఇచ్చారు.

బాధ్యతాయుతమైన వ్యూహానికి కట్టుబడి ఉన్నాం
మానవ సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐని కో పైలట్ గా ప్రవేశపెడుతున్నామని, వాటి స్థానంలో కాదని ఆమె అన్నారు. ‘కొన్ని ఉ‍ద్యోగాల్లో మార్పులు ఉండొచ్చు కానీ, అధిక విలువ పనులను చేపట్టడానికి ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంపైనే మా దృష్టి ఉంది. ఉద్యోగాల  కోత కంటే వాటి పెరుగుదల, ఉద్యోగ పరివర్తనకు ప్రాధాన్యమిచ్చే బాధ్యతాయుతమైన ఏఐ స్వీకరణ వ్యూహానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని రోష్ని నాడార్‌ సపష్టం చేశారు.

ఐటీ రంగంలో నియామకాలు మందకొడిగా సాగుతున్న తరుణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో సిబ్బంది నికర చేర్పులు తక్కువగా ఉన్నాయి. ఇది నియామకంలో మరింత జాగ్రత్తగా విధానాన్ని సూచిస్తుంది. కొన్ని కంపెనీలు స్వల్ప లాభాలను నమోదు చేయగా, మొత్తం ట్రెండ్ ప్రకారం నియామకాలు చల్లబడ్డాయి.

జూన్ తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ 1,984 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. గత త్రైమాసికంలో 2,23,420గా ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఆ త్రైమాసికంలో 2,23,151కి తగ్గింది. మార్చిలో 13 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు జూనలో 12.8 శాతానికి తగ్గింది.

ఇదీ చదవండి: విప్రో చేతికి హర్మన్‌ డీటీఎస్‌.. రూ. 3,270 కోట్ల డీల్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?