Breaking News

ఉగాది వేళ బంగారం కొందామనుకుంటే.. ప్చ్‌!

Published on Mon, 04/08/2024 - 11:32

Gold Rate today: ఉగాది వేళ బంగారం కొందామనుకున్న పసిడి ప్రియులకు బంగారం ధరలు నిరుత్సాహాన్ని కలిగించాయి. ఒక్క రోజు గ్యాప్‌ ఇచ్చి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్‌ 8) పెరిగాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు 10 గ్రాములకు ఈరోజు రూ.490 మేర పెరిగాయి.

బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.

హైదరాబాద్‌ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.65,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున పెరిగి రూ.71,620 వద్దకు ఎగిసింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా..
♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది.

♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.450 పెరిగి రూ.66,600లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.490 చొప్పున పెరిగి రూ.72,650 ఉంది.

♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 ఎగిసి రూ.65,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 పెరిగి రూ.71,770 వద్ద ఉంది.

♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది.

cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా మళ్లీ పెరిగాయి. క్రితం రోజు స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.88,000 ఉంది. ఇది క్రితం రోజున రూ. 87,000 లుగా ఉండేది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)