Breaking News

పసిడి ధరలు పైపైకి.. త్వరలో తులం బంగారం లక్ష

Published on Tue, 04/09/2024 - 15:58

ఢిల్లీ : గతంలో ఎన్నడూ లేనంతగా పసిడి ధరలు గరిష్టానికి చేరుతున్నాయి. ఫలితంగా ఉగాది పర్వదినం సందర‍్భంగా పసిడి ధరలు ఇంకాస్త పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి.. రూ.71,730 చేరింది. 

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

హైదారబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది 

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది 

వైజాగ్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది 

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730గా ఉంది 

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,700గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,760గా ఉంది

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,730

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,880

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్‌?
సాధారణంగా బంగారం, స్టాక్‌ మార్కెట్‌లో లాభాలకు సంబంధం ఉంది. స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు గడిస్తే బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. అయితే ప్రస్తుతం స్టాక్ మార్కెట్, బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. బంగారం ధరలు కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం పెరుగుతున్నాయి. 

యుఎస్‌లో బంగారం ధరలు (ఏప్రిల్‌2 నాటికి) 2,250 డాలర్లకు పైగా ఆల్ టైమ్ హైని తాకాయి.2022లో చివరి కనిష్ట స్థాయి నుండి బంగారం ధర 38శాతం పెరిగింది. దేశీయంగా కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌1) ప్రారంభంతో దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.70,000 కొత్త మైలురాయిని దాటాయి. 

ఊహాగానాలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, డాలర్ ఇండెక్స్ పతనం, చైనాలో డిమాండ్,యూఎస్‌ వడ్డీ రేటు తగ్గుదల అంచనాలతో సహా అనేక అంశాలు కారణంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో తులం బంగారం రూ.లక్షకు చేరిన ఆశ్చర్య పోనక్కర్లేదని ఆర్ధిక నిపుణుల అంచన

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)