Breaking News

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇవే కారణాలు!

Published on Tue, 09/02/2025 - 16:37

అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ పటిష్టంగా ఉండటం, టారిఫ్‌లపరమైన అనిశ్చితి, ఈ నెలలో అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాల మధ్య పసిడి ర్యాలీ కొనసాగుతోంది. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం సోమవారం దేశీయంగా న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ. 1,000 పెరిగి మరో కొత్త రికార్డు స్థాయి రూ. 1,05,670ని తాకింది.

99.5 శాతం స్వచ్ఛత బంగారం రూ. 800 పెరిగి రూ. 1,04,800కి చేరింది. అమెరికా టారిఫ్‌లపరమైన అనిశ్చితి, వడ్డీ రేట్లపై ఫెడ్‌ వైఖరి గురించి ఆందోళన పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు, పసిడిలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మళ్లుతున్నారని ట్రేడర్లు వెల్లడించారు. రూపాయి మారకం క్షీణిస్తుండటం, భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పుత్తడి ఆకర్షణీయత మరింత పెరిగిందని ట్రేడ్‌జీని చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డి. త్రివేశ్‌ తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఫెడ్‌ రిజర్వ్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, టారిఫ్‌లపరమైన అనిశ్చితి, ఈ నెలలో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మొదలైన అంశాలు స్పాట్‌ మార్కెట్లో పసిడి ర్యాలీకి కారణమవుతున్నాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్‌) కాయ్‌నాత్‌ చైన్‌వాలా చెప్పారు.

ఇదీ చదవండి: వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!

అంతర్జాతీయంగా ఫ్యూచర్స్‌ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) పసిడి రేటు ఒక దశలో 3,556.87 డాలర్లకు ఎగిసింది. ఇది కొత్త ఆల్‌టైమ్‌   రికార్డు స్థాయి కావడం గమనార్హం. మరోవైపు, వెండి ధర కేజీకి మరో రూ. 1,000 పెరిగి ఇంకో కొత్త గరిష్ట స్థాయి రూ. 1,26,000ని తాకింది. పర్యావరణహిత విద్యుత్, ఎల్రక్టానిక్స్‌ తదితర పరిశ్రమల నుంచి డిమాండ్‌తో పాటు స్పెక్యులేషన్‌ కూడా వెండి ర్యాలీకి దోహదపడుతోందని త్రివేశ్‌ వివరించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)