Breaking News

సరిగా కొంటేనే.. బంగారం!

Published on Mon, 04/20/2026 - 08:22

ధర ఎంతన్నా ఉండనివ్వండి. బంగారమనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. తరతరాలుగా పుత్తడికి ప్రాధాన్యం పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఇంటింటా ఆభరణాల రూపంలో మురిపిస్తూనే, ఆర్థికంగా కూడా భరోసాను కల్పించే సాధనంగా పనికొస్తోంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల దెబ్బతో ఒకసారి అయిదు వేలు పెరిగితే, ఇంకోసారి పదివేలు పడిపోయి.. బంగారం రేట్లు సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఎమోషనల్‌ కారణంతోనో, పెట్టుబడి కోసమో ఆభరణాలు, నాణేల రూపంలో కొనుక్కుని పెట్టుకున్న వారిలోను, కొనుక్కోవాలనుకుంటున్న వారిలోనూ ఆందోళన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్రమంగా పుత్తడిని చూసే తీరు మారుతోంది. కేవలం ఆభరణంగానో లేదా భావోద్వేగాలతో ముడిపడిన ఆస్తిగానో చూడటం కాకుండా పెట్టుబడి కోణంలో చూసే ధోరణి పెరుగుతోంది. యువ ఇన్వెస్టర్లు తమ సౌకర్యార్థం, లిక్విడిటీ కోసం క్రమంగా ఈటీఎఫ్‌లు, డిజిటల్‌ గోల్డ్‌ వైపు మళ్లుతున్నారు. పుత్తడిని ఎమోషనల్‌గా కొనుక్కోవడం కాకుండా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఇదే సరైన విధానమన్నది 
విశ్లేషకుల మాట.

తయారీ.. తరుగుతో కోత..

మార్కెట్లో మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది ఇన్వెస్టర్లు జ్యుయలరీ రూపంలో కొన్న బంగారాన్ని కూడా పెట్టుబడిగానే పరిగణిస్తుంటారు. అనుబంధం, సంప్రదాయాలపరంగా ఆభరణాలు, నాణేల రూపంలో బంగారానికి ఎంతో విలువ ఉన్నప్పటికీ, ఆర్థిక కోణంలో చూస్తే మాత్రం భౌతికరూపంలోని పసిడి కొనుగోలు విధానంలో లోటుపాట్లు ఎక్కువ. తయారీ చార్జీల కారణంగా వీటి విలువ కొనుక్కోగానే 10–15 శాతం తగ్గిపోతుంది. రూ. 1 లక్ష విలువ చేసే బంగారు ఆభరణాన్ని కొన్నప్పుడు, సాధారణంగా రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు మేకింగ్‌ చార్జీల కింద పోతుంది. అంటే మనం వాస్తవానికి రూ. 85,000–90,000 విలువ చేసిన బంగారమే కొన్నట్లవుతుంది. ఇక మళ్లీ రీసేల్‌ చేయాలంటే తరుగు అంటూ తీసేస్తారు. దీంతో సదరు బంగారు ఆభరణంపై వచ్చే రాబడి మరింత తగ్గిపోయినట్లవుతుంది. ఇదిగాకుండా వీటిని సురక్షితంగా భద్రపర్చుకోవడం మరో ఎత్తు. ఇక తిరిగి విక్రయించినప్పుడు, రేట్లు భారీగా పెరిగితే తప్ప, రీసేల్‌ విలువ తక్కువే వస్తుంది. ఆ రకంగా పెట్టుబడుల కోణంలో చూస్తే ఇది అంత లాభసాటి వ్యవహారంగా ఉండదు.

పసిడిపై మళ్లీ ఫోకస్‌

దేశ, విదేశ పరిణామాలతో ఇటీవలి కాలంలో పసిడికి మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశి్చతి, ఈక్విటీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, కరెన్సీ బలహీనపడుతుండటంలాంటి అంశాలు మళ్లీ బంగారంపై ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనం పాత్రను పోషిస్తుంది. మిగతా ఆర్థిక సాధనాలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇది స్థిరత్వాన్ని అందిస్తుంది.  

ఇదీ... నయా రూట్‌

ఇలాంటివన్నీ చూశాకేనేమో... ఇపుడు పుత్తడిలో పెట్టుబడులు పెట్టే విధానంలో గణనీయంగా మార్పులొచ్చాయి. గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చాయి. పసిడి ధరలకు అనుగుణంగా ఉండే ఈ ఈటీఎఫ్‌లను షేర్లలాగానే స్టాక్‌ ఎక్స్ఛేజీల్లో కొనుక్కోవచ్చు. అమ్ముకోవచ్చు. వీటిని కావాల్సినప్పుడు కొనుక్కుని, అమ్ముకునేందుకు (లిక్విడిటీ) వీలు, పారదర్శకత ఉంటుంది. భౌతికంగా భద్రపర్చుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంత వెసులుబాటు ఉన్నందుకే ఇన్వెస్టర్లు వీటివైపు చూడటం పెరుగుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరీన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) కూడా గతంలో వచ్చాయి. పసిడి ధరను ట్రాక్‌ చేసే ఈ బాండ్లపై వార్షికంగా అదనంగా 2.5 శాతం వడ్డీ కూడా ఇవ్వడంతో పాటు క్యాపిటల్‌ గెయిన్స్‌ నుంచి కూడా మినహాయింపు లభించేలా వీటిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు వచి్చ, కొత్త బాండ్ల జారీ ఆగినప్పటికీ, గతంలో జారీ చేసినవి అలాగే కొనసాగుతున్నాయి.  

పోర్ట్‌ఫోలియోకి భద్రత

పోర్ట్‌ఫోలియోను సమతూకంతో ఉంచడంలో పసిడి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పసిడి పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తే చాలా ఉపయోగకరం. ఈక్విటీల తరహాలో భారీ రిటర్నుల కోసం కాకుండా, స్థిరత్వానికి, డైవర్సిఫికేషన్‌ కోసం ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా 10–15 శాతం పసిడికి, సుమారు 60 శాతం ఈక్విటీలకి, 25 శాతం డెట్‌ సాధనాలకు కేటాయిస్తే పోర్ట్‌ఫోలియో సమగ్రంగా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు రిసు్కలు తగ్గుతాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు లిక్విడిటీతో పాటు స్వల్పకాలిక అవసరాల కోసం, పోర్ట్‌ఫోలియోలో పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఉపయోగపడతాయి.

నాణేలు, ఆభరణాలతో ప్రతికూలం..

  • మేకింగ్‌ చార్జీల రూపంలో కొనగానే 10–15%

  • తరుగుతో రీసేల్‌ విలువలోనూ కోత

  • ఆభరణం కొనుగోలు ధర: రూ. 1,00,000

  • మేకింగ్‌ చార్జీలు : రూ. 10,000  15,000

  • వాస్తవంగా బంగారం ధర: రూ.85,000-90,000

పోర్ట్‌ఫోలియో కేటాయింపు ఇలా..

  • ఈక్విటీ 60 శాతం

  • డెట్‌ 25 శాతం

  • పసిడి 10-15 శాతం

ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్‌లతో కాసుల వేట!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)