Breaking News

సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం

Published on Fri, 12/05/2025 - 16:25

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి ‘గాడ్‌ఫాదర్’గా పిలుచుకునే ఏఐ సైంటిస్ట్‌ జెఫ్రీ హింటన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఏఐ వేగవంతమైన పురోగతి కారణంగా లక్షల్లో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటీవల అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్‌తో కలిసి జార్జ్‌టౌన్ యూనివర్శిటీలో జరిగిన చర్చలో హింటన్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘ఏఐ వల్ల భారీ నిరుద్యోగం రాబోతోందన్న విషయం చాలా మందికి స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. టెక్ దిగ్గజాలు డేటా సెంటర్లు, చిప్స్‌పై ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయగల ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

2023లో గూగుల్‌ను వీడిన హింటన్ ఏఐ ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ.. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందన్న ఆశావాదాన్ని ఖండించారు. ‘కొత్త ఉద్యోగాలు వస్తాయి కానీ, దీని పరిణామాల వల్ల కోల్పోయే ఉద్యోగాల సంఖ్యను అవి ఎప్పటికీ భర్తీ చేయలేవు’ అని స్పష్టం చేశారు.

టెక్ దిగ్గజాల అభిప్రాయాలు

ఏఐ ఉద్యోగాలపై చూసే ప్రభావం గురించి టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఇటీవల ‘ఏఐ సామూహిక తొలగింపులకు దారితీయదు, కానీ ఉద్యోగాల స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ త్వరలోనే చాలా అంశాల్లో మానవుల అవసరం లేకుండా పోతుందన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘మరో 20 సంవత్సరాల్లో చాలా మందికి పని చేయవలసిన అవసరమే ఉండదు’ అని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)