Breaking News

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

Published on Thu, 08/27/2026 - 06:23

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ముందుకు రావాలని కెనడా ఇన్వెస్టర్లను ఆహా్వనించారు. పెద్ద సంఖ్యలో యువ జనాభాతో నిలకడగా వృద్ధి సాధిస్తూ భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా నిలుస్తోందన్నారు.

 దేశీయంగా వినియోగం భారీగా పెరుగుతోందని, క్యాపిటల్‌ మార్కెట్లు కూడా విస్తరిస్తున్నాయని వివరించారు. ‘దీర్ఘకాలిక కోణంలో ఆలోచిస్తున్న కెనడా ఇన్వెస్టర్లకు భారత్‌లో అసమానమైన అవకాశాలు ఉన్నాయి. భారీ స్థాయి, సుస్థిర వృద్ధి, యువ జనాభా, పెరుగుతున్న వినియోగం మొదలైన సానుకూలాంశాలు ఉన్నాయి‘ అని టొరంటోలో పరిశ్రమ దిగ్గజాలతో భేటీ సందర్భంగా ఆమె చెప్పారు.  

పెరుగుతున్న మధ్య తరగతి వర్గం, ప్రపంచ స్థాయి డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, పట్టణీకరణ వేగవంతం అవుతుండటం తదితర కారణాలతో ఎకానమీలోని ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు వస్తున్నాయన్నారు. పటిష్టమైన డిజిటల్‌ వ్యవస్థతో ఆర్థిక, వాణిజ్య సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెప్పారు. లావాదేవీలపరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌ టైమ్‌ పేమెంట్స్‌ సిస్టమ్‌గా యూపీఐ ఎదిగిందని, ఆర్థిక సమ్మిళితత్వం, వినూత్నతకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు.
 

Videos

రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు

పందితో 30 నిమిషాల ఫైట్.. 14 ఏళ్ల కుర్రాడి దమ్ము చూస్తే షాక్!

ఇరుముడి హిట్‌తో రవితేజ దశ తిరిగిందా?

నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?

మరో జలవిలయం.. ప్రాణభయంతో జనం పరుగులు

నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు

జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

అమ్మవారికి మంగళ సూత్రాలు సమర్పించిన అంబటి మురళి

"కొడుకా ఎక్కడున్నావురా నాన్నా”.. తండ్రి ఆరాటం కంటతడి పెట్టిస్తోంది!

కరెంట్ పోల్ ఎక్కిన తాగుబోతు.. గంటపాటు టెన్షన్

Photos

+5

ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)

+5

ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)

+5

రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)

+5

'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)

+5

హీరోయిన్ మానస వారణాసి ఓనం సెలబ్రేషన్స్.. (ఫొటోలు)

+5

నేపాల్‌లో వరద బీభత్సం... (ఫొటోలు)

+5

'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దుబాయిలో తన డ్యాన్స్ స్టూడియోలో పూర్ణ ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)