Breaking News

EPFO వేతన పరిమితి పెంపుతో మరో భారీ బెనిఫిట్‌?

Published on Thu, 09/17/2026 - 16:13

దేశంలోని కోట్లాది ఉద్యోగులకు కీలకమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద తప్పనిసరి కవరేజీకి వర్తించే నెలవారీ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్‌ 16న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన పరిమితి 2026 సెప్టెంబర్‌ 17 నుంచి అమల్లోకి రానుంది.

ఈ నిర్ణయంతో ప్రస్తుతం నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం పొందుతున్న కొత్త ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఇకపై తప్పనిసరి ఈపీఎఫ్‌వో కవరేజీ పరిధిలోకి రానున్నారు. కేంద్రం అంచనా ప్రకారం 51 లక్షల మందికి పైగా అదనపు ఉద్యోగులు ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో వారికి ప్రావిడెంట్‌ ఫండ్‌ పొదుపుతో పాటు, వర్తించే నిబంధనల ప్రకారం ఉద్యోగుల పెన్షన్‌ పథకం (EPS), ఉద్యోగుల డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ (EDLI) వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలకు అవకాశం లభిస్తుంది.

బీమా రూ.7 లక్షల నుంచి రూ.10.5 లక్షలకు?

ఈపీఎఫ్‌వో సభ్యులకు అందుబాటులో ఉండే ఎంప్లాయీస్‌ డిపాజిట్‌ లింక్‌డ్‌ ఇన్సూరెన్స్‌ (EDLI) పథకం కింద ప్రస్తుతం గరిష్ఠ బీమా ప్రయోజనం రూ.7 లక్షలుగా ఉంది. నిబంధనల ప్రకారం, 12 నెలల నిరంతర సర్వీస్‌ ఉన్న సభ్యుడు మరణించిన సందర్భంలో సగటు నెలవారీ వేతనాన్ని 35తో గుణించి, గత 12 నెలల సగటు ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌లో 50 శాతాన్ని కలుపుతారు. ఈ బ్యాలెన్స్‌ ఆధారిత భాగానికి రూ.1.75 లక్షల పరిమితి ఉంది. మొత్తం ప్రయోజనం గరిష్ఠంగా రూ.7 లక్షలకు పరిమితం.

ప్రస్తుతం గరిష్ఠ వేతన పరిమితి రూ.15,000గా ఉన్నందున గరిష్ఠ లెక్కింపు ఇలా ఉంటుంది..

(రూ.15,000 × 35) + రూ.1.75 లక్షలు = రూ.7 లక్షలు

ఇప్పుడు ఈపీఎఫ్‌వో తప్పనిసరి కవరేజీకి వేతన పరిమితిని రూ.25,000కు పెంచిన నేపథ్యంలో, ఇదే రూ.25,000 పరిమితిని ఈడీఎల్‌ఐ బీమా లెక్కింపులోనూ వర్తింపజేస్తే గరిష్ఠ మొత్తం ఇలా ఉంటుంది..

(రూ.25,000 × 35) + రూ.1.75 లక్షలు = రూ.10.50 లక్షలు

అంటే, ఈడీఎల్‌ఐ లెక్కింపులోనూ వేతన పరిమితిని రూ.25,000గా ప్రభుత్వం సవరించినట్లయితే మాత్రమే గరిష్ఠ బీమా ప్రయోజనం రూ.10.5 లక్షలకు చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కేబినెట్‌ ప్రకటనలో మాత్రం ఈడీఎల్‌ఐ గరిష్ఠ బీమా మొత్తాన్ని రూ.7 లక్షల నుంచి రూ.10.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రత్యేకంగా ప్రకటించలేదు.

అదేవిధంగా, ఈడీఎల్‌ఐ  లెక్కింపులోని రూ.1.75 లక్షల ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ భాగాన్ని కూడా ప్రభుత్వం భవిష్యత్తులో పెంచితే గరిష్ఠ బీమా ప్రయోజనం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ భాగానికి రూ.1.75 లక్షల పరిమితి కొనసాగుతోంది.

ఇదీ చదవండి: ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకి

Videos

రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!

కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి ఎలా వస్తున్నాయి..? డబ్బులు లేవని చెప్పడానికి సిగ్గులేదా..!

మధుకర్ మహా మాయగాడు నందు కేసులో కొత్త ట్విస్ట్..!

పోరాటం ఫలించింది.. సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్‌

సాయికృష్ణ కేసులో మరో నిందితుడు సరెండర్

PM Modi: బెంగాల్ మహిళలకు గుడ్ న్యూస్

మల్లారెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతల తిరుగుబాటు? ఫ్లెక్సీలు చించివేత

కరువు పరిస్థితులపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం

లోకేష్‌ పర్యటనలో కోటంరెడ్డికి పరాభవం?.. మంత్రి పదవి ఆశలకు బ్రేక్‌ పడినట్టేనా?

ఖమ్మంలో విషాదం... తండ్రి నిర్ణయానికి ఇద్దరు చిన్నారులు బలి..

Photos

+5

పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)

+5

సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)