Breaking News

ట్విటర్ కొనుగోలుపై విచారణ.. ససేమిరా అంటున్న మస్క్

Published on Fri, 10/06/2023 - 13:49

ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) 2022లో ఎక్స్ (ట్విటర్) సంస్థను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కంపెనీని కొనుగోలు చేసే సమయంలో ఏవైనా ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించారా అనే దిశలో అమెరికాకు చెందిన SEC దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, ట్విటర్ సంస్థను కొనుగోలు చేసిన సమయంలో ఏవైనా చట్టాలను ఉల్లంగించారా అని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎస్ఈసీ స్టేట్‌మెంట్స్, డీల్స్ వంటి వాటికి సంబందించిన ఫైలింగ్ గురించి మస్క్‌ను ప్రశ్నించడానికి సన్నద్ధమైంది.

ఎలాన్ మస్క్ ఈ దర్యాప్తుకు హాజరు కావడానికి నిరాకరించినట్లు సమాచారం. కానీ దీనికి సాక్ష్యమివ్వడానికి ఎస్ఈసీ మస్క్‌ను బలవంతం చేస్తోంది, దీనికోసం ఫెడరల్ కోర్టులో దావా కూడా వేసింది. అయితే ఇప్పటికే యూఎస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అనేక సార్లు మస్క్ వాంగ్మూలాన్ని తీసుకున్నట్లు, మళ్ళీ హాజరు కావాల్సిన అవసరం లేదని మస్క్ తరపు లాయర్ తెలిపాడు.

ఇదీ చదవండి: ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్!

ఎలాన్ మస్క్ ట్విటర్‌లో ఎంత వాటా కలిగి ఉన్నారనే దాని గురించి నిజం చెప్పారా.. లేదా అని తెలుసుకోవడానికి ఎస్ఈసీ మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. 2023 మేలో శాన్‌ఫ్రాన్సిస్కోకి వచ్చి మాట్లాడాల్సిందిగా ఎస్ఈసీ  కోరింది. దీనికి మస్క్ సెప్టెంబర్ 15న రావడానికి అంగీకరించారు. కానీ ఆ తరువాత మనసు మార్చుకుని రాలేకపోతున్నట్లు తెలిపాడు. 

ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌పై పిటిషన్.. ఆ రైట్స్ కల్పించాలంటున్న మాజీ భార్య!

ఎస్ఈసీ చేపట్టిన దర్యాప్తు కేసులను కొట్టివేయడానికి మస్క్ చేసిన ప్రయత్నాలను US డిస్ట్రిక్ట్ జడ్జి ఆండ్రూ కార్టర్ తిరస్కరించారు. మిలియన్ల కొద్దీ స్టాక్‌లను కొనుగోలు చేయడానికి, ట్విటర్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ట్వీట్స్ చేయడానికి, ఎగ్జిక్యూటివ్‌లు, అంతర్గత వ్యక్తులతో సమావేశం కావడానికి సమయం ఉంటుంది, కానీ విచారణకు రావడానికి మాత్రం సమయం ఉండదా అంటూ అసహనం వ్యక్తం చేశాడు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)