Breaking News

మస్క్ ప్రసంశలు.. AI రంగంలో వారే టాప్!

Published on Fri, 07/10/2026 - 07:47

ఏఐ రంగంలో.. టెక్ కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ప్రత్యర్థిగా ఉన్న ఆంత్రోపిక్ ప్రస్తుతం ఏఐ రంగంలో అగ్రస్థానంలో ఉందని ఆయన ప్రశంసించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X)లో ప్రముఖ ఏఐ మోడళ్ల పనితీరుపై జరిగిన చర్చపై మస్క్ స్పందించారు. ''ఆంత్రోపిక్ గురించి నేను గతంలో చేసిన అంచనా తప్పు. ప్రస్తుతం ఏఐ రంగంలో వారే ముందున్నారు. వారి మిథోస్/ఫేబుల్ (Mythos/Fable) మోడల్ స్థాయికి సమానమైన మోడల్‌ను ఇప్పటివరకు ఏ కంపెనీ విడుదల చేయలేదు. త్వరలోనే వారు మరింత శక్తివంతమైన మిథోస్ 2ను కూడా తీసుకురానున్నారు'' అని పేర్కొన్నారు.

ఆంత్రోపిక్ ప్రస్తుతం ప్రపంచంలో ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం రూపొందించిన క్లాడ్ మోడళ్లు మంచి గుర్తింపు పొందాయి. గత ఏడాది విడుదలైన క్లాడ్ ఓపస్ 4.5 మోడల్ కోడింగ్ సామర్థ్యాల్లో అద్భుతమైన ఫలితాలను చూపడంతో ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు, ఏఐ పరిశోధకులు దీనిని విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో ఓపెన్ఏఐ, గూగుల్, ఎక్స్ఏఐ వంటి దిగ్గజ సంస్థలకు ఆంత్రోపిక్ గట్టి పోటీగా నిలిచింది.

ఎలాన్ మస్క్ వంటి ప్రముఖ వ్యాపారవేత్త ప్రత్యర్థి సంస్థను బహిరంగంగా ప్రశంసించడం ఆంత్రోపిక్ సాధించిన విజయానికి నిదర్శనం. ఏఐ రంగంలో పోటీ మరింత తీవ్రంగా మారుతున్న ఈ సమయంలో.. కొత్త ఆవిష్కరణలు, శక్తివంతమైన మోడళ్లతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందే అవకాశాలు మరింత పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)