Breaking News

‘పరాయి ప్రతిభ’ కోసం పోటాపోటీ!

Published on Wed, 11/12/2025 - 19:23

వలస కార్మికులకు మళ్లీ డిమాండ్‌ పెరుగుతోంది. విదేశీ ప్రతిభను ఆకర్షించడానికి దేశాల మధ్య పోటీ విస్తృతమవుతోంది. వలస కార్మికుల కోసం కెనడా భారీ ప్రణాళికను ప్రకటించగా.. విదేశీ ప్రతిభను వద్దనుకున్న అమెరికా సైతం మనసు మార్చుకుని మళ్లీ కావాలంటోంది.

ఆవిష్కరణలపరంగా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు కెనడా కీలక చర్యలు తీసుకుంది. 1,000 మందికి పైగా అగ్రశ్రేణి అంతర్జాతీయ పరిశోధకులు ముఖ్యంగా హెచ్ -1బి వీసా హోల్డర్లను లను ఆకర్షించే లక్ష్యంతో 1.7 బిలియన్ కెనడియన్‌ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తన మొదటి ఫెడరల్ బడ్జెట్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

నైపుణ్యం కలిగిన నిపుణులు, ముఖ్యంగా నిర్బంధ యూఎస్ వీసా విధానాల వల్ల ప్రభావితమైన వారి కోసం ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని కెనడా ప్రవేశపెడుతోంది. టెక్నాలజీ, హెల్త్‌ కేర్‌, నిర్మాణం వంటి అధిక-డిమాండ్ రంగాలను లక్ష్యంగా ఈ వ్యూహాత్మక ప్రణాళికను కెనాడా ప్రభుత్వం తీసుకొచ్చింది.  విదేశీ ప్రతిభకు గుర్తింపునిచ్చేలా, వారు కెనడియన్ శ్రామిక శక్తిలో ఏకీకృతం అయ్యేలా వ్యవస్థల రూపకల్పనకు నిధులు వెచ్చిస్తోంది.

అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడం, ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్  హెచ్ -1బి వీసా రుసుములను పెంచేయడంతో విదేశీ ప్రతిభకు కలిగిన ఇబ్బందికర పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కెనడా ప్రణాళిక రచించింది. ఫాస్ట్-ట్రాక్ మార్గంతో పాటు, అగ్రశ్రేణి పరిశోధకులు, ఆవిష్కర్తలను  నియమించుకోవడానికి బడ్జెట్ నిధులను కేటాయిస్తోంది.

ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి గ్లోబల్ హబ్‌గా ఎదగాలన్న కెనడా ఆకాంక్షను తెలియజేస్తోంది. పరిశ్రమ నాయకులు ఈ ప్రణాళికను స్వాగతించారు. ఇది క్లిష్టమైన కార్మిక అంతరాలను భర్తీ చేయడానికి, ఏఐ, బయోటెక్‌, క్లీన్ ఎనర్జీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో కెనడా పోటీతత్వాన్ని పెంచడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.

మనసు మార్చుకున్న అమెరికా!
వలస కార్మికుల విషయంలో అమెరికా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే వలస కార్మికులపై విరుచుకుపడిన అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ (US President Trump).. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లు (రూ.88లక్షలు)కు పెంచి అమెరికాలో స్థిరపడాలనుకొనే ఉద్యోగస్థుల ఆశలపై నీళ్లు చల్లారు. వీసాల విషయంలో కఠిన  నిబంధనలను తెరపైకి తెచ్చారు.

అయితే, తాజాగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం వలస కార్మికులపై ట్రంప్‌ సానుకూలంగా మాట్లాడారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌తోపాటు, రక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన వలస కార్మికులను నియమించుకోవాలన్నారు. ఆ రంగాలలో అమెరికన్లకు నైపుణ్యత లేదని అంగీకరించారు. 

Videos

Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్

జగన్ కట్టించిన ఇళ్లకు... చంద్రబాబు హంగామా

Prakash Raj: అవును.. నేను చేసింది తప్పే

మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

కేతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ

మా MROలు వేస్ట్.. జనసేన నేత సంచలన కామెంట్స్

Vidadala Rajini: రాసిపెట్టుకోండి.. జగనన్న ఒకసారి చెప్పాడంటే

New Delhi: పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన మోదీ

కపిలతీర్థంలో అయ్యప్ప స్వాములకు అవమానం

Photos

+5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)

+5

ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)

+5

వణికిస్తున్న చలి.. జాగ్రత్తగా ఉండాల్సిందే (ఫొటోలు)

+5

అల్లరి నరేశ్ 12ఏ రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెహమాన్ కన్సర్ట్ జ్ఞాపకాలతో మంగ్లీ (ఫొటోలు)