ఏఐతో సరిగమలు పలికించేలా రెహమాన్‌ వినూత్న ప్రాజెక్ట్‌

Published on Mon, 09/29/2025 - 12:46

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్ సీక్రెట్ మౌంటైన్’ అనే వినూత్న సంగీత ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఇది మెటావర్స్‌లో వర్చువల్ ఏఐ ఆధారిత బ్యాండ్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్రాజెక్ట్‌కులో భాగంగా ప్రత్యేకమైన డిజిటల్ సింఫనీ ద్వారా ప్రపంచ సంస్కృతులను ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెహమన్‌ ఓ కార్యక్రమంలో చెప్పారు.

సీక్రెట్ మౌంటైన్ అంటే ఏమిటి?

ఇది ఆరుగురు సభ్యులున్న వర్చువల్ బ్యాండ్. ఇందులో ప్రముఖ సంగీత కళాకారులు కారా, బ్లెసింగ్, ఎకామ్, జెంటమ్, డేవిడ్, ఆఫియా ఉన్నారు. ఈ బ్యాండ్ పూర్తిగా మెటావర్స్‌లో ఉంటుంది. మెటావర్స్ అనేది ఒక సామూహిక వర్చువల్ స్పేస్. ఇందులో డిజిటల్ అవతార్లు వర్చువల్‌గా సాంకేతికతలను ఉపయోగించి పరస్పరం సంభాషించవచ్చు. కలిసి పాడవచ్చు. వర్చువల్‌ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) కలయికతో ఇది పని చేస్తుంది. వీటిని ఉపయోగించి రెహమాన్‌ సంగీతాన్ని సృష్టించనున్నారు.

ఏఐ, క్రియేటివిటీ

ఏఐ సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ ప్రాజెక్ట్‌ ఉపయోగించబడుతుందని, అదే సమయంలో మానవ కళాత్మకతను ఇది భర్తీ చేయదని రెహమాన్ నొక్కి చెప్పారు. ఇందులో అవతార్లు ఉపయోగించినా సంగీతం, సాహిత్యం, స్వరాలు రియలిస్టిక్‌గా ఉంటాయన్నారు. ఏఐ మ్యూజిక్‌ ప్రోడక్షన్‌ను వేగవంతం చేస్తుందని చెప్పారు. ఇటీవల యూఎస్‌లో రెహమాన్ ఓపెన్ ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌, పెర్‌ప్లెక్సిటీకి చెందిన అరవింద్ శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఈ వినూత్న ప్రాజెక్ట్‌కు సారథ్యం వహిస్తున్న రేడియంట్ సోల్స్ అనే సంస్థ సిలికాన్ వ్యాలీలోని ఏఐ కంపెనీలతో  భాగస్వామ్యం కలిగి ఉంది.

ఇదీ చదవండి: ఎన్నికల వేళ రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల

Videos

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

Photos

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)