మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
5జీ అన్‌లిమిటెడ్ డేటా: ఎయిర్‌టెల్‌లో అదిరిపోయే ప్లాన్‌లు!
Published on Fri, 03/24/2023 - 22:00
తక్కువ టారిఫ్‌తో అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఆనందించాలనుకునే వారి కోసం ఎయిర్‌టెల్‌లో అదిరిపోయే ప్లాన్‌లు ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఇటీవల డేటా వినియోగంపై రోజువారీ పరిమితిని ఎత్తేస్తూ అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ప్రకటించింది. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన నగరాల్లో ఉంటున్న ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఎటువంటి పరిమితులు లేకుండా అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఆనందించవచ్చు.
ఇదీ చదవండి: కార్యాలయాలకు కేరాఫ్ హైదరాబాద్! ఆఫీస్ స్పేస్ లీజుల్లో టాప్
అన్‌లిమిటెడ్ 5జీ డేటా అందించే ప్లాన్లు ఎయిర్‌టెల్‌లో రూ.500 లోపే చాలానే ఉన్నాయి.
- రూ.239 ప్లాన్: ఈ ప్లాన్ కింద 1GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అర్హత ఉన్న కస్టమర్లు అపరిమిత 5జీ డేటా వాడుకోవచ్చు.
- రూ. 265 ప్లాన్: ఈ ప్లాన్‌తో 1GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
- రూ. 296 ప్లాన్: ఈ ప్లాన్ 30 రోజుల పాటు అపరిమిత కాలింగ్, ఎస్సెమ్మెస్‌లతో పాటు
- మొత్తం 25GB డేటా అందిస్తుంది. అర్హత ఉన్న యూజర్లు అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించవచ్చు.
- రూ. 299 ప్లాన్: ఈ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత కాలింగ్‌తో 1.5GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు 28 రోజుల పాటు లభిస్తాయి. అర్హులైన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు.
- రూ. 319 ప్లాన్: ఒక నెల వాలిడిటీ ఉండే ఈ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాలింగ్ ఉంటాయి.
- రూ. 359 ప్లాన్: ఇది కూడా ఒక నెల వాలిడిటీ, 2GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాలింగ్ అందిస్తుంది. అదనంగా ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు ఉచిత సభ్యత్వం లభిస్తుంది.
- రూ. 399 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ప్లాన్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2.5GB రోజువారీ డేటా లభిస్తాయి.
- రూ. 479 ప్లాన్: ఈ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 56 రోజుల పాటు 5జీ డేటాను, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు అందిస్తుంది.
- రూ. 489 ప్లాన్: మొత్తం 50GB డేటాతో ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 100 ఎస్సెమ్మెస్‌లు 30 రోజుల పాటు లభిస్తాయి.
- రూ. 499 ప్లాన్: ఈ ప్లాన్ కింద అపరిమిత కాలింగ్, 3GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల ప్యాక్ వాలిడిటీతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచిత సభ్యత్వం పొందవచ్చు.
ఇదీ చదవండి: ధూమ్‌మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది!
#
Tags : 1