Breaking News

విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్.. అసలు సమస్యేంటి?

Published on Mon, 12/01/2025 - 14:13

తీవ్రమైన సోలార్‌ రేడియేషన్‌ (సోలార్ ఫ్లేర్స్) వల్ల విమాన నియంత్రణ వ్యవస్థలోని కీలక డేటా పాడవ్వకుండా ఉండేందుకు ఎయిర్‌బస్‌ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారతదేశంలోని అన్ని ఎయిర్‌బస్ ఏ320 విమానాల సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ప్రకటించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు చెందిన మొత్తం 323 ఏ320 ఫ్యామిలీ విమానాల్లో అవసరమైన అప్‌గ్రేడ్ పూర్తయింది. ఈ సత్వర చర్య ద్వారా విమానయాన భద్రతను నిర్ధారించడంలో భారత్ ముందడుగు వేసింది.

అప్‌గ్రేడ్ వివరాలు

ఇండిగో: మొత్తం 200 విమానాలూ 100 శాతం అప్‌గ్రేడ్ పూర్తి చేసింది.

ఎయిర్ ఇండియా: 113 విమానాల్లో 100 వాటిలో అప్‌గ్రేడ్ పూర్తయింది. 4 విమానాలు బేస్ మెయింటెనెన్స్‌లో ఉన్నాయి. 9 విమానాలకు మార్పు అవసరం లేదని ధ్రువీకరించారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: 25 విమానాల్లో 23 అప్‌గ్రేడ్ పూర్తి అయింది. మిగిలిన 2 విమానాలు లీజు ఒప్పందం ముగియడంతో తిరిగి వాటిని రిటర్న్‌ చేయనున్నారు.

సమస్య ఏమిటి?

ఎయిర్‌బస్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యంత తీవ్రమైన సోలార్‌ రేడియేషన్‌ (సౌర జ్వాలల సమయంలో) వల్ల Elevator and Aileron Computer (ELAC) అనే ఫ్లైట్‌ కంట్రోల్ కంప్యూటర్ పనితీరు తగ్గవచ్చు. దీనివల్ల ఎలివేటర్, ఐలెరాన్‌లకు వెళ్లే డేటాలో మార్పులుండవచ్చు. ఇది విమానం పిచ్ (పైకి/కిందకు), రోల్ (మలుపులు) నియంత్రణపై తాత్కాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్య గుర్తించిన వెంటనే యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దానిని అనుసరించి శనివారం డీజీసీఏ కూడా భారతీయ ఎయిర్‌లైన్స్‌కు తక్షణ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ ఆదేశం ఇచ్చింది.

ఇదీ చదవండి: యాప్స్‌.. మార్కెటింగ్ యంత్రాలా?

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)