Breaking News

అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్‌బాక్స్‌’

Published on Fri, 06/13/2025 - 13:04

విమానయానంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందులోని పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కాక్‌పిట్‌(పైలట్లు కుర్చునే ప్రదేశం) కమ్యూనికేషన్లను విశ్లేషించడం కీలకంగా మారుతుంది. ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్‌), ఫ్లైట్ డేటా రికార్డర్ల(ఎఫ్‌డీఆర్‌)పై ఆధారపడుతుంటారు. సాధారణంగా వీటిని బ్లాక్‌బాక్స్ అని పిలుస్తారు. పైలట్ తీసుకునే నిర్ణయాలు, సిస్టమ్ వైఫల్యాలు, అత్యవసర ప్రతిస్పందనలను విశ్లేషించడం ద్వారా విమానయాన నిపుణులు భవిష్యత్తులో భద్రతా ప్రోటోకాల్స్‌ను మెరుగుపరిచేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘటనలోనూ బ్లాక్‌బాక్స్‌లోని వివరాలు కీలకంగా మారనున్నాయి. అయితే ప్రమాదం జరిగినచోట ఈ బ్లాక్‌బాక్స్‌ను ఇంకా గుర్తించాల్సి ఉంది.

బ్లాక్‌బ్లాక్స్‌లోని వివరాల విశ్లేషణలో కీలక దశలు

బ్లాక్‌బాక్స్ రికవరీ

ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి బ్లాక్‌బాక్స్‌ను ముందుగా రికవరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీవీఆర్‌, ఎఫ్‌డీఆర్‌ పరికరాలు తీవ్రమైన మంటలతోపాటు ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా రూపొందిస్తారు. ఫోరెన్సిక్ బృందాలు తమ దర్యాప్తును ప్రారంభించడానికి కీలకమైన ఆడియో, ఫ్లైట్‌ డేటాను దీని నుంచి సేకరిస్తాయి.

ఆడియో విశ్లేషణ

కాక్ పిట్ ఆడియోను ట్రాన్స్‌స్క్రైబ్ చేయడం ద్వారా ప్రమాదం జరిగే ముందు వరకు సాగిన కమ్యునికేషన్‌ను విశ్లేషిస్తారు. కీలక క్షణాలను గుర్తించడానికి నిపుణులు పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్‌లేషన్‌లు, అలారం, ప్రమాద నేపథ్య శబ్దాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రమాద పరిస్థితుల్లో ఒత్తిడి స్థాయులు, కమాండ్ స్పష్టత, ప్రతిస్పందన సమయాన్ని వెల్లడిస్తుంది. ఇది సిబ్బంది సదరు పరిస్థితిని ఎలా నిర్వహించారో నిర్ణయించడానికి అవసరం అవుతుంది.

ఎఫ్‌డీఆర్‌ నివేదిక

ఫ్లైట్ డేటాతో కూడిన ఆడియో సింక్రనైజింగ్‌ ఎఫ్‌డీఆర్‌ రిపోర్ట్‌లో విమానం ఎత్తు, ఎయిర్ స్పీడ్, ఇంజిన్ పనితీరు, కంట్రోల్‌ ఇన్‌పుట్స్ వంటి పారామీటర్‌లు ఉంటాయి. నిబంధనల ప్రకారమే పైలట్ చర్యలు తీసుకున్నారా లేదా అనే వివరాలు ఇందులో ఉంటాయి. ప్రమాద పరిస్థితి ఎంత వేగంగా పెరిగిందో అంచనా వేయడానికి ఈ సింక్రనైజేషన్ తోడ్పడుతుంది.

	ఎయిర్ ఇండియా విమానం AI-171 బ్లాక్ బాక్స్ లభ్యం

హెచ్చరికలు గుర్తించడం

హెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో సిబ్బంది ఎలా ప్రతిస్పందించారో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్‌బాక్స్‌ ఉపయోగపడుతుంది. ఇంజిన్ ఫైర్ అలారంలు, అత్యవసర వ్యవస్థ యాక్టివేషన్‌తో సహా అగ్ని సంబంధిత వార్నింగ్‌లను విశ్లేషించేందుకు ఇది సాయం చేస్తుంది.

సమన్వయాన్ని అంచనా వేయడం

అత్యవసర సమయంలో సిబ్బంది సమన్వయాన్ని అంచనా వేయడానికి పైలట్ కమ్యూనికేషన్ కీలకం. కెప్టెన్, ఫస్ట్‌ ఆఫీసర్‌ పనులను సరిగ్గా నిర్వర్తించారా.. నిబంధనలను పాటించారా.. అనే వివిధ అంశాలను పరిశీలిస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి గ్రౌండ్‌ సిబ్బంది అందించిన కమ్యూనికేషన్లను, అత్యవసర ప్రకటనలను విమాన సిబ్బంది అనుసరించారా లేదా అని గమనిస్తారు.

ఇదీ చదవండి: సోనా కామ్‌స్టర్‌ ఛైర్మన్‌ మృతి

సిస్టమ్ వైఫల్యాలను పరిశీలించడం

ఒకవేళ విద్యుత్ లేదా మెకానికల్ లోపం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లయితే సిస్టమ్ వైఫల్యాలను పరిశీలించేందుకు బ్లాక్‌బాక్స్‌ ఉపయోగపడుతుంది. అందులోని ఆన్‌బోర్డ్ సెన్సార్‌లు, మెయింటెనెన్స్ రికార్డ్‌లు కారణాన్ని గుర్తించడంలో సహాయపడతాయి. డిజైన్ లోపాలు లేదా పట్టించుకోని భద్రతా సమస్యలు సంఘటనకు దోహదపడ్డాయా అని పరిశోధకులు అన్వేషిస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)