Breaking News

అదానీ-హిండెన్‌బర్గ్ కేసు : కీలక పరిణామం 

Published on Mon, 08/14/2023 - 14:44

అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్‌ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బిలియనీర్‌ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపై చేసిన ఆరోపణలపై విచారణను ముగించేందుకు గడువును 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టేటస్ రిపోర్టును సమర్పించేందుకు గడువును  పొడిగించాలని కూడా సెబీ కోరింది. ఈ ఏడాది మేలో, ఈ అంశంపై అప్‌డేట్ చేసిన స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించేందుకు ఆగస్టు 14 వరకు సెబీకి  సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.

సెబీ 15 రోజుల పొడిగింపును ఎందుకు కోరింది?
అదానీ గ్రూప్‌పై యుఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు సంబంధించి తాను దర్యాప్తు చేస్తున్న 24 లావాదేవీలలో 17 విచారణను పూర్తి చేసినట్లు సెబి తెలిపింది.  మిగిలిన అంశాలపై విచారణ త్వరలోనే పూర్తి చేయనుంది. అయితే  తదుపరి చర్యలను ప్లాన్ చేయడానికి ఇతర నియంత్రణ సంస్థలు , విదేశీ అధికార పరిధి నుండి మరింత సమాచారం కోరినట్లు సెబీ సుప్రీంకు తెలియజేసింది. విదేశీ లావాదేవీల ప్రమేయం కారణంగా కేసుకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశోధించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు   పేర్కొంది.

ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్‌  ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో అదానీ  గ్రూపు తీరని సంక్షోభంలో  కూరుకుపోయింది.  ఈ నేపథ్యంలో  పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కమిటీ ఏర్పాటు సంగతి తెలిసిందే.  హిండెన్‌బర్గ్‌ ఆరోపణల మేరకు నిబంధనలకు వ్యతిరేకంగా అదానీ గ్రూప్ తన గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను తారుమారు చేసిందా? సంబంధిత-పార్టీ లావాదేవీలను బహిర్గతం చేయడంలో  విఫలమైందా? అనే విషయాలపై  సెబీ విచారణ చేపట్టింది.   

మరోవైపు అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ అదానీ పోర్ట్స్ కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఈ షాక్‌తో సోమవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.  

కాగా తమ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో చేసిన తప్పుడు ఆరోపణలని హిండెన్‌బర్గ్ వాదనను గౌత అదానీ  గట్టిగా తోసిపుచ్చారు. కేవలం తమ  స్టాక్ ధరలను తగ్గించడం ద్వారా లాభాలను సంపాదించడం లక్ష్యంగా పెట్టుకుని, కుట్రపూరితంగానేకంపెనీ ఫాలో-ఆన్-పబ్లిక్ ఆఫర్ ముందు ఈ తప్పుడు నివేదికను వెల్లడించారని  2023 వార్షిక సాధారణ సమావేశంలో స్పష్టం చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)