Breaking News

నా బడ్జెట్‌కు 50-30-20 రూల్‌ సరిపోతుందా?

Published on Mon, 04/28/2025 - 07:24

మూడు నుంచి ఐదేళ్ల కాలానికి.. కార్పొరేట్‌ ఫండ్స్, షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్, పీఎస్‌యూ ఫండ్స్‌లో ఏది అనుకూలం?      – మంజునాథ్‌  

కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ 80 శాతం అధిక క్రెడిట్‌ రేటింగ్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. బ్యాంకింగ్‌ అండ్‌ పీఎస్‌యూ ఫండ్స్‌ 80 శాతం బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. వీటితోపాటు షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ అన్ని రకాల పరిస్థితుల్లోనూ అనుకూలమైనవి. దీర్ఘకాలంలో వీటిలోని రిస్క్‌–రాబడులు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి.

ఇన్వెస్టర్లు రెండు కారణాల దృష్ట్యా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వివిధ రకాల డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. వైవిధ్యం ఎక్కువ. మెచ్యూరిటీ కాలంపై స్పష్టత ఉంటుంది. ఏడాది కాలానికి మించిన లక్ష్యాల కోసం, డెట్‌ విభాగంలో షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ అనుకూలంగా ఉంటాయి.

ఇంటి బడ్జెట్‌ విషయంలో 50–30–20 ఆర్థిక సూత్రం గురించి విన్నాను. నా ఆర్థిక అంశాలకు ఇది మంచి సూత్రమేనా?     – కరణ్‌ రాథోడ్‌

మీ నెలవారీ ఆదాయాలను ఏ రకంగా వర్గీకరించాలన్నది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఆదాయంలో 20 శాతాన్ని అవసరాల కోసం కేటాయించాలి. అంటే ఇంటి అద్దె, గ్రోసరీ, విద్యుత్, ఈఎంఐలు, స్కూల్‌ ఫీజులు అన్నీ కలిపి 50 శాతానికే పరిమితం కావాలి. ఆదాయంలో 30 శాతాన్ని కోరికల కోసం కేటాయించుకోవచ్చు. అంటే రెస్టారెంట్లలో విందులు, ఓటీటీ చందాలు, విహార యాత్రలు, షాపింగ్, ఇతర హాబీల కోసం కేటాయింపులు 30 శాతం మించకూడదు. ఇక మిగిలిన 20 శాతాన్ని పొదుపు కోసం కేటాయించాలి.

మీ ఆర్థిక అంశాలను సులభంగా నిర్వహించుకునేందుకు ఇది అనుకూలిస్తుంది.  ముఖ్యంగా వేతన జీవులు, అప్పుడే కెరీర్‌ ఆరంభించిన వారికి ఇది ఎంతో సులభం. కాకపోతే ఇదొక సాధారణ సూత్రమే కానీ, అందరికీ అనుకూలమని చెప్పలేం. వ్యక్తిగత ఆదాయం, జీవన వ్యయాలు, బాధ్యతలు ఇవే ఒకరి బడ్జెట్‌ను నిర్ణయించేవి.

ఉదాహరణకు ఒక నగరానికి చెందిన యువ ఉద్యోగి నెలకు రూ.40,000 సంపాదిస్తున్నాడని అనుకుందాం. పెద్ద నగరం కావడంతో అద్దెకు, రవాణా కోసమే నెల జీతంలో సగం ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు కోరికలు, పొదుపు కోసం మిగిలేదేమీ ఉండదు. అదే రూ.2 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి అయితే ఆదాయంలో 30–35 శాతంతోనే అవసరాలను తీర్చుకోవడం సులభం. అప్పుడు పొదుపు చేయడానికి 30–40 శాతం మిగులు ఉంటుంది.  

కనీసం 20 శాతం పొదుపు 
ఎవరైనా సరే బడ్జెట్‌ ఆరంభించేందుకు 50–30–20 సూత్రం మంచి ఫలితమిస్తుంది. మీ జీవన అవసరాలు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. అలాగే, ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేయాలి. కోరికల విషయంలో కొంత రాజీ పడినా సరే పొదుపును కొనసాగించాలి.

ఎలా ఆరంభించాలో తెలియకపోతే అప్పుడు ఆదాయంలో 20 శాతాన్ని పెట్టుబడులకు మళ్లించే విధంగా ఆటోమేట్‌ చేసుకోవాలి. అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వెళ్లేలా సిప్‌ పెట్టుకోవాలి. మొదట పొదుపు, పెట్టుబడి తర్వాతే ఖర్చులకు వెళ్లాలి. స్థిరమైన పొదుపు, వివేకంతో చేసే ఖర్చుతో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది.  

సమాధానాలు:: ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)