Breaking News

నేడు ‘పరిషత్‌’ పోరు

Published on Thu, 11/05/2026 - 03:05

సాక్షి, అమరావతి/ఎమ్మిగనూరు టౌన్‌: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల క­మిషన్‌ (ఎస్‌ఈసీ) బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రపునేఠ పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ము­రసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరి­స్థితులపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారని.. కొన్ని ప్రాంతాలు మినహా పోలింగ్‌ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్లు నివేదించినట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది. 

కలెక్టర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు ఎదురైతే క్షేత్రస్థాయి అధికారుల నుంచి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదికలు తెప్పించుకుని, వాటి ఆధారంగా తగిన ని­ర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వ­ర్షాల కారణంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగపురం మండలాల్లో ఎన్నిక వా­యిదా వేస్తున్నట్టు ఆ జిల్లా కలెక్టర్లు బుధవారం ఉద­యం ప్రకటించినా.. గంటన్నర అనంతరం తిరిగి అక్కడ పో­లింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.  

ఉదయం 7 గంటలకే పోలింగ్‌ మొదలు 
ఏకగ్రీవాల అనంతరం 28 జిల్లాల పరిధిలో 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎస్‌ఈసీ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 659 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాగా, 77 మండలాల్లో ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మిగిలిన 582 మండలాల్లో 2,169 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 

9,821 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,051 ఎంపీటీసీ స్థానా­లు ఏకగ్రీవం కాగా.. మూడుచోట్ల ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. మిగిలిన 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగనుంది. ఆయా ఎంపీటీసీ స్థానాల్లో 18,843 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కలిపి మొత్తం 20,966 మంది పోటీ పడుతున్నారు. మొత్తంగా 31,460 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేయగా.. 2,61,52,377 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది.  

16,064 సమస్యాత్మక ప్రాంతాలు.. 15,396 చోట్లే సీసీ కెమెరాలు 
మొత్తం 31,460 పోలింగ్‌ కేంద్రాలకు గాను 8,904 సమస్యాత్మక, 7,160 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్టు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. 16,064 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 15,396 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఎస్‌ఈసీ పేర్కొంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన వాటిలోనూ 668 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా వీడియోగ్రఫీకి పరిమితం చేశారు. మరోవైపు సాధా­రణ పోలింగ్‌ కేంద్రాలుగా పేర్కొన్న చోట్ల 6 వేల­చోట్ల ల్యాప్‌టాప్‌ల ద్వారా వెబ్‌కాస్టింగ్, మరో 6,507 చోట్ల వీడియోగ్రఫీ, 2,889 చోట్ల ఇతర ఏర్పాట్లు చేసినట్టు వివరించింది. ఎన్నికల నిర్వహణలో 49,121 పోలింగ్‌ సిబ్బంది, బందోబస్తు కోసం 40,769 మంది పోలీసులు పాల్గొంటారని తెలిపింది.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)