Breaking News

‘భయంతో కారులోంచి బయటకు రాలేదు’

Published on Sat, 07/12/2025 - 19:37

గుడివాడ: తనను టార్గెట్‌ చేసే టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారని కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు(శనివారం, జూలై 12) వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి ఉప్పాల హారిక వెళుతున్న సమయంలో ఆమె కారును పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే ఆమె కారుపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. 

ఈ అరాచక ఘటనపై ఉప్పాల హారిక మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. కారులో ఉన్న తమను చంపడానికి యత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ దాడితో భయపడిపోయి తన భర్త, తాను కారులోంచి బయటకు రాలేదన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, తన కారు అద్దాలను ధ్వంసం చేశారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. టీడీపీ గూండాలు తన కారుపై దాడి చేస్తున్నా పోటీసులు పట్టించుకోకుండా వారికి సహకరించినట్లు వ్యవహరించారన్నారు.

 

కారును చుట్టుముట్టి..
కృష్ణా జిల్లాలోని గుడివాడలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

మహిళ అని చూడకుండా దాడికి పాల్పడ్డాయి పచ్చమూకలు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. వాళ్లు దాడి చేసుకుంటారు.. మనకెందుకులె అన్న చందంగా వ్యవహరించారు.  వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళుతున్న దారిలోనే  ప్రభుత్వ సమావేశం జరుగుతుంది. దాంతో ఆమెను వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్లకుండా చేసేందుకు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు.  

గంటకు పైగా ఆమె కారును కదలనీయకుండా నానా బీభత్సం సృష్టించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక మహిళా జడ్పీ చైర్‌పర్సన్‌ పార్టీ కార్యక్రమానికి వెళుతుండగా ఈ రకంగా దాడికి పాల్పడటం ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనడానికి నిదర్శమని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)