Breaking News

కోటి కంటే ఎక్కువ సంతకాలే వచ్చాయి: సజ్జల

Published on Sun, 12/07/2025 - 19:06

తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జనం నుంచి అనూహ్య స్పందన వచ్చిందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి  స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం, డిసెంబర్‌ 7వ తేదీ) ఎమ్మెల్సీలు, పార్లమెంట్‌ కో ఆర్డినేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జడ్సీ చైర్‌పర్సన్లు, జడ్సీ వైస్‌ చైర్‌పర్సన్లు, పీఏసీ, సీఈసీ, ఎస్‌ఈసీ మెంబర్లతో సజ్జల టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ..  ‘ కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కోటి కన్నా ఎక్కువ సంతకాలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జనం స్పందించారు. కోటి‌ సంతకాల ప్రతులను‌10వ తేదీన జిల్లా కేంద్రాలకు పంపాలి. జిల్లా స్థాయి కార్యక్రమం 13న కాకుండా 15న నిర్వహించాలి. 17న వైఎస్ జగన్ సహా ముఖ్య నేతలు.. గవర్నర్‌ను కలుస్తారు.’ అని పేర్కొన్నారు. 

గత కొన్ని రోజులుగా సజ్జల రామకృష్ణారెడ్డి..  కోటి సంతకాల సేకరణ అంశానికి సంబంధించి వరుసగా జూమ్‌ మీటింగ్‌లు, టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు నేతలను నుంచి కోటి సంతకాల సేకరణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు పలు సలహాలు ఇస్తున్నారు సజ్జల.

ఇదీ చదవండి:
చంద్రబాబు క్షద్ర రాజకీయాలు: పుత్తా శివశంకర్‌

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)