Breaking News

బాబు సర్కార్‌ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది: వైఎస్సార్‌సీపీ

Published on Tue, 02/24/2026 - 13:20

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్‌లో కల్తీ పాల బాధితులను వైఎస్సార్‌సీపీ నేతలు విడదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం మీడియాతో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడారు.

మెరుగైన వైద్యం అందించాలి: వేణుగోపాలకృష్ణ
పాలలో కల్తీ జరిగి ఐదు ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షం స్పందించిన తరువాతే ప్రభుత్వ స్పందించింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయింది. సంబంధిత మంత్రులు ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. విషయం తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... వైఎస్సార్ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లందరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించాలి. చనిపోయిన వారికి రూ.25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. తిరుపతి లడ్డూ కల్తీ అనే మాట ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు కల్తీకి తెర తీశారు. ఇంకా చాలామంది పేషెంట్లు ఉన్నారు. వారిని కూడా ఆస్పత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలి.

ముందే ఎందుకు స్పందించలేదు?: విడదల రజని
కల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఘటన 19 మంది బాధితులయ్యారు. ఐదుగురు చనిపోయారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ నిలదీస్తే ప్రభుత్వ స్పందించింది. ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ఎందుకు ముందే స్పందించలేదు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిద్రపోతుంది. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పని చేస్తుందా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 900 మంది డయేరియాతో ఆసుపత్రుల్లో చేరారు. అనేక మంది చనిపోయారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైంది. కల్తీ పాలతో అనారోగ్యంతోనే రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే వైద్యం దొరికే పరిస్థితి కనిపించలేదు.

రెయిన్‌బో ఆస్పత్రిలో రితిక్ అనే బాలుడికి సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రిలో ఇప్పటివరకు వైద్యం కోసం ఎనిమిదిన్నర లక్షలు బిల్లు కట్టాల్సి వచ్చింది. మిగిలిన వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారు. చనిపోయిన వారికి పది లక్షలు ఇస్తారట.. ఏమూలకు సరిపోతుంది.

ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపయోగకరంగా ఉంటాయని గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాల ప్రారంభించారు. చంద్రబాబు తన వ్యాపారం స్కాముల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.. ప్రజారోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. తప్పు జరిగిందన్న విషయం వాళ్ళ మాటల్లోనే బయటపడింది. రాష్ట్రంలో అనేక హాస్టల్లో విద్యార్థులు కూడా బాధితులు అవుతున్నారు. హెరిటేజ్ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చాము ప్రజలన్నీ గమనిస్తున్నారు

ఆరోగ్య శాఖ నిద్రపోతుంది..! కల్తీ పాల ఘటనపై రజిని

బాధితులకు అండగా ఉంటాం: తానేటి వనిత
ఒకే ఫ్యామిలీకి చెందిన అనేకమంది బాధితులు ఆసుపత్రిలో చేరడంతో వైద్యులకు అనుమానం రావడంతోనే పాల కల్తీ వ్యవహారం బయటపడింది. బాధితులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అండగా ఉండేది. చికిత్స పొందుతున్న బాధితులకు భవిష్యత్తులో ఎంత బిల్లు అవుతుందో తెలియని పరిస్థితి. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం 25 లక్షల రూపాయలు చెల్లించాలి.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)