Breaking News

NHRC: కురుపాం ఘటన.. ఏపీ ప్రభుత్వ అలసత్వంపై ఫిర్యాదు

Published on Mon, 10/13/2025 - 13:01

సాక్షి, ఢిల్లీ: కురుపాం గిరిజన విద్యార్థుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అడుగు వేసింది. సోమవారం ఆ పార్టీ ప్రతినిధుల బృందం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసింది. చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వ అలసత్వంపై ఫిర్యాదు చేసింది. 

ఏపీ కురుపాం గిరిజన హాస్టల్స్‌లో భారీ సంఖ్యలో విద్యార్థులు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడడం తెలిసిందే. అయితే వాళ్లకు సకాలంలో చికిత్స అందకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహంతో ఉంది. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత నీరు, మంచి భోజనం అందించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిరయాదు చేసింది.  పెద్ద సంఖ్యలో పిల్లలు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడిన వైనాన్ని హక్కుల సంఘానికి వివరించింది.

గిరిజన హాస్టల్స్ లో చంద్రబాబు సర్కార్ బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం, ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం వహించడంపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గిరిజన విద్యార్థుల హక్కులను కాపాడాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్‌.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపింది. వైఎస్సార్సీపీ బృందంలో ఎంపీలు గురుమూర్తి, తనుజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, రాజన్న దొర తదితరులు ఉన్నారు.

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)