Breaking News

మధిర సహాన మృతిపై వైఎస్సార్‌సీపీ నేతల తీవ్ర విచారం

Published on Tue, 10/22/2024 - 21:27

సాక్షి,గుంటూరు: టీడీపీ రౌడీషీటర్‌ నవీన్‌ దాడిలో గాయపడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మధిర సహాన చివరకు ఓడిపోయింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాన మరణంపై సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీకి మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు యువతి కుటుంబాన్ని పరామర్శించారు.

అనంతరం మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సహన విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూస్తున్నారు. అక్కడి మంత్రి ఏమైపోయారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దిశ యాప్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సహాన మరణ వార్తపై వైఎస్‌ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. రేపు (బుధవారం)సహన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు’ అని  అన్నారు.  

సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి. బయటకు చెప్పుకోలేని అభద్రతాభావంలో సహన తల్లిదండ్రులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. దిశ లాంటి చట్టాలను వైఎస్‌ జగన్‌ హయాంలో తీసుకొచ్చారు. దిశ లాంటి చట్టాల అవసరం ఉంది. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)