Breaking News

జగన్‌ రైతులను కలిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి?: శైలజానాథ్‌

Published on Wed, 02/19/2025 - 15:00

సాక్షి, తాడేపల్లి: కనీస గిట్టుబాటు ధర లేక నానా అగచాట్లు పడుతున్న మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు. అసలు జగన్‌ కదిలే వరకు, రైతులను ఆదుకోవాలన్న కనీస ఆలోచన సీఎం చంద్రబాబు ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు.

జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ మంత్రి వెల్లడించారు. జగన్‌ పర్యటనలో భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలీసులను మోహరించలేదని, అదే అనుమానాన్ని చివరకు రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్‌ తెలిపారు.

శైలజానాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

జగన్‌ కదిలితే తప్ప..:
చంద్రబాబు అధికారంలో ఉండగా ఏరోజూ రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైయస్‌ జగన్‌ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే తప్ప, చంద్రబాబుకి మిర్చి రైతుల సమస్యలు గుర్తుకు రాలేదు. మిర్చి రైతులకు మద్ధతు ధర కల్పించాలంటూ ఆయన హడావుడిగా కేంద్ర మంత్రికి లేఖ రాశారు. మిర్చి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకే జగన్‌ గుంటూరు మిర్చి యార్డు సందర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్చి రైతులకు న్యాయం చేయడానికే ఆయన అక్కడ పర్యటించారు.

భద్రత కల్పించలేదు:
రైతులను పరామర్శించడానికి వైయస్‌ జగన్‌ వెళితే, యార్డు వద్ద కావాలనే రక్షణ వలయం ఏర్పాటు చేయలేదని మిర్చి రైతులే చెబుతున్నారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత కలిగి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రైతులతో మాట్లాడటానికి వస్తుంటే భద్రత కల్పించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం దేనికి నిదర్శనం?. అసలు జగన్‌  రైతులతో మాట్లాడితే, చంద్రబాబుకి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు వ్యవహారశైలిపై ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా..:
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను కూడా పార్టీ కార్యకర్తలను చూసినట్లే చూస్తున్నారు. పొలీస్‌ వ్యవస్థను పార్టీల పరంగా విడకొట్టే విష సంస్కృతికి చంద్రబాబు తెర తీశారు. పోలీస్‌ వ్యవస్థ వేధింపుల గురించి హైకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా చంద్రబాబుకి చీమ కుట్టినట్లు అయినా లేదు.  

పాలనలో చంద్రబాబు విఫలం:
9 నెలల్లోనే పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉండి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు తెచ్చుకోవడం ఆయనకు చేతకావడం లేదు. చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు, కక్షపూరిత పాలన పుణ్యమా అని రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రతి మంగళవారం అప్పులు చేయడం తప్ప, 9 నెలల కాలంలో చంద్రబాబు నెరవేర్చిన హామీ ఒక్కటైనా ఉంటే చూపించాలి. ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌తోనే కాలం గడుపుతున్నారు. విపక్ష వైఎస్సార్‌సీపీ నాయకుల మీద కేసులు బనాయించడం మినహా, చంద్రబాబు పాలనలో ప్రజలకు జరిగిన మేలు శూన్యం అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ స్పష్టం చేశారు.

 

 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?