పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం: కాకాణి

Published on Fri, 07/03/2026 - 12:32

సాక్షి, ప్రకాశం: దేశ చరిత్రలో ఎన్డీయే ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టు ఎవరు చేయలేదన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి. రాష్ట్రంలో పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం. ప్రభుత్వం తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలని కాకాణి డిమాండ్‌ చేశారు. పొగాకు కంపెనీలతో చంద్రబాబు, లోకేష్ లాలూచీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడాం. పొగాకు రైతుల పరిస్థితి వర్ణనాతీతం. దేశ చరిత్రలో ఎన్డీయే ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టు ఎవరు చేయలేదు. పొగాకు ధర క్వింటాకు 16వేలకు పడిపోయింది. ఇంత దారుణం ఎప్పుడు జరగలేదు. పొగాకు కొనుగోలులో కూడా అవకతవకలు జరిగాయి. రెఫరెన్స్‌లు ఇవ్వడం దారుణం. తమకు అనుకూలమైన వారి బేళ్లు ఎక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

కర్ణాటకలో పొగాకు క్వింటా ధర 36 వేలు.. ఆంధ్రలో 16 వేలు. దీనికి కారణం ఎవరు?. పొగాకు కంపెనీలతో చంద్రబాబు, లోకేష్ లాలూచీ పడ్డారు. తక్కువకు రైతుల దగ్గర కంపెనీలకు కట్టబెట్టి.. కంపెనీ నుండి చంద్రబాబు, లోకేష్ లబ్ది పొందే ప్రయత్నం. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు వరి తినకపోతే ఇంకెవరు తినేవాళ్ళు లేరా?. ప్రజలను చంద్రబాబు తప్పు దారి పట్టిస్తున్నాడు. పొగాకు రైతులు భారీగా నష్టపోతున్నారు. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి. ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటు’ అని మండిపడ్డారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)