Breaking News

HYD: జూన్‌ 3న వైఎస్సార్సీపీ ఐటీ విభాగ స‌ద‌స్సు

Published on Fri, 05/26/2023 - 14:26

సాక్షి, అమ‌రావ‌తి: వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జూన్ 3వ తేదీ హైద‌రాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, ప్రొఫెష‌న‌ల్స్‌తో ఒక భారీ స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది. హైటెక్ సిటీలోని బుట్టా క‌న్వెన్ష‌న్ హాలులో ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ స‌ద‌స్సు ప్రారంభ‌మ‌వుతుంది. ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 

ఈ స‌మావేశానికి హైద‌రాబాద్‌ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగుల‌ను పెద్ద సంఖ్య‌లో ఆహ్వానిస్తున్నారు. వైస్సార్‌సీపీ ఐటీ విభాగం అధ్య‌క్షులు సునీల్ కుమార్ రెడ్డి పోసింరెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ సద‌స్సు జ‌రుగుతుంది. ఈ స‌ద‌స్సులో వైస్సార్‌సీపీ పార్టీ బ‌లోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి, ఐటీ ఉద్యోగుల స‌మ‌స్య‌లపైన సమగ్రంగా చ‌ర్చిస్తారు. ఈ స‌ద‌స్సుకు వైస్సార్‌సీపీని అభిమానించే ఐటీ ఉద్యోగులంద‌రూ తప్పకుండా హాజరై సదస్సును విజయవంతం చేయాలని సునీల్ కుమార్ రెడ్డి కోరారు. స‌ద‌స్సుకు హాజ‌రు కాద‌ల‌చిన‌వారు ముందుగా త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవాల‌న్నారు. వివరాలకు  7829922666, 7032597980 నెంబర్లలో సంప్రదించాలని ఆయ‌న సూచించారు.

ఇది కూడా చదవండి: పేదల తరుపున ప్రభుత్వం పోరాడింది.. ఇక అమరావతి అందరిది: వెంకటపాలెం సభలో సీఎం జగన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)