నీట్‌ తరహాలో ఏపీ డీఎస్సీలో అక్రమాలు

Published on Sun, 07/26/2026 - 12:25

సాక్షి,తిరుపతి: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యువత తిరగబడితే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విద్యార్థి పోరాటాలు నిరూపించాయని భూమన గుర్తుచేశారు. దేశంలో నీట్ పరీక్షల తరహాలోనే ఏపీలో డీఎస్సీ పరీక్షల్లోనూ అడ్డగోలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్తూ.. డీఎస్సీలో ఒక్కో పోస్టును రూ.30 లక్షలకు అమ్ముకున్నారని, చివరికి స్పోర్ట్స్ కోటా పోస్టులను కూడా వదలకుండా విక్రయించారని ధ్వజమెత్తారు.

కోట్లాది రూపాయలు దండుకుంటూ లోకేష్ రాష్ట్ర విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. తప్పు చేయడం కంటే అవినీతికి పాల్పడటం అత్యంత ప్రమాదకరమని, అందుకే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి లోకేష్ తప్పుకోవాలని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)