Breaking News

Vijayawada Floods: వైఎస్‌ జగన్‌కు కృష్ణలంక వాసుల కృతజ్ఞతలు

Published on Mon, 09/02/2024 - 12:06

సాక్షి, తాడేపల్లి: విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. సింగ్‌నగర్‌ సహా బాధిత ప్రాంతాలను మధ్యాహ్నం మూడు గంటలకు పరీశీలించనున్నారు.

ఈ మేరకు ఇప్పటికే పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు వైఎస్‌ జగన్‌. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్‌ వాల్‌ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్‌ వాల్‌ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వైఎస్‌ జగన్‌కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

రిటైనింగ్‌ వాల్‌ లేకపోతే పూర్తిగా తమ జీవితాలు అతలాకుతలమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైఎస్‌ జగన్‌..  వైఎస్సార్‌సీపీ శ్రేణులు సహాయ చర్యల్లో అండగా ఉంటారని బాధితులకు భరోసానిచ్చారు.  

కృష్ణా నదికి రిటైనింగ్‌ వాల్‌.. వరదల నుంచి కోట వంటి రక్షణ
గతంలో చినుకు పడితే విజయవాడ కృష్ణలంక వాసులు వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే బెంబేలెత్తిపోయేవారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తడంతో జనం కంటిమీద కునుకు లేకుండా అల్లాడిపోయేవారు.  కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా కృష్ణలంక ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వరద ముంపు సమస్య శాశ్వతంగా తప్పింది.

గతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం మూడు లక్షల క్యూసెక్కుల వరదనీరు వదిలితే చాలు... కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, కోటినగర్, పోలీస్‌కాలనీ, రణదివెనగర్, గౌతమినగర్, నెహ్రూనగర్, చలసానినగర్, గీతానగర్, బాలాజీనగర్, ద్వారకానగర్, భ్రమరాంబపురం, తారకరామానగర్‌ ప్రాంతాలు నీటమునిగేవి. వరద మొదలవగానే ఈ ప్రాంతాల్లోని దాదాపు 80వేల మంది ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది.

ఈ పరిస్థితులను గమనించిన గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా చుక్కనీరు ఇళ్లలోకి రాకుండా రూ.474.51 కోట్లతో కృష్ణా నది వెంబడి పద్మావతి ఘాట్‌ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కిలో మీటర్లు పటిష్టంగా రక్షణ గోడ నిర్మించారు. ఈ ప్రాంత ప్రజలకు వరద ముంపు నుంచి రక్షణ కల్పించడమే కాకుండా రూ.12.3 కోట్లతో రివర్‌ ఫ్రంట్‌ పార్కును అభివృద్ధి చేశారు. వైఎస్‌ జగన్‌ దార్శనికత వల్ల నేడు 8లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా.. ఆ విషయమే తెలియకుండా ప్రశాంతంగా తమ ఇళ్లలో ఉంటున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)