Breaking News

జోజి నగర్‌ బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published on Tue, 12/16/2025 - 08:23

సాక్షి, విజయవాడ: భవానీపురం జోజి నగర్‌లో ఇళ్ల కోల్పోయిన బాధిత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తమ గోడును ఆయనకు చెప్పుకున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలను ఆయనకు చూపించాయి. 

Vijayawada: సుప్రీం స్టే ఆర్డర్ ఉన్నా కూల్చేశారు.. YS జగన్‌తో బాధితుల ఆవేదన

‘‘25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మావన్నీ కూడా పట్టా భూములే. అన్ని అనుమతులున్నాయి. వాటర్‌, కరెంట్‌ బిల్లులు కడుతూ వచ్చాం. మా ఇళ్లను అన్యాయంగా కూల్చేశారు. మమ్మల్ని రోడ్డున పడేశారు..’’ అని జగన్‌ వద్ద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితులతో.. ‘‘అధైర్య పడొద్దని.. అండగా ఉంటామని.. అన్నివిధాల అవసరమైన సాయం అందిస్తామని’’ అని ఆయన భరోసా ఇచ్చారు.    

జగన్‌ రాకతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. ఆయన్ని చూసేందుకు.. ఫొటోలు తీసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు.. కరచలనం చేసేందుకు.. భారీగా జనం తరలివచ్చారు.

ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజి నగర్‌లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు.  తమ ఇళ్లను కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులు ప్రభుత్వ పెద్దలకు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వైఎస్‌ జగన్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు కంటతడి పెట్టగా.. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని, అవసరమైన న్యాయ సహయం అందిస్తానని ఆయన వాళ్లకు మాటిచ్చారు.  ఈ క్రమంలో.. ఇవాళ స్వయంగా ఆయన జోజినగర్‌ వెళ్లి బాధితులతో కలిసి కూల్చివేత ప్రాంతాలను పరిశీలించనున్నారు. 

ఇదిలా ఉంటే.. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ప్రొద్భలంతోనే కూల్చివేతలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూల్చివేతల సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కోర్టు ఆదేశాలున్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగిపడేసి కూల్చివేతలు జరిపారు. పక్కా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నామని.. పాతికేళ్లుగా ఏళ్లుగా నివాసముంటున్నామని.. ఇప్పుడు నిర్ధాక్షణ్యంగా పడగొట్టి రోడ్డుపాలు చేశారని పలువురు ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)