Breaking News

108 సర్వీసులకు బాబు సర్కారు ఉరి: వైఎస్‌ జగన్‌

Published on Tue, 09/23/2025 - 02:40

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 108 సర్వీసులకు చంద్ర­బాబు ప్రభుత్వం ఉరి వేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్‌ చేసినా 108 సర్విసు రాకపోవడంతో పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు ఆటోను ఆశ్రయించాల్సి వచి్చందని, చివరకు అందులోనే ప్రసవం జరిగిందని.. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను జత చేసి చంద్రబాబు సర్కార్‌ అసమర్థతను నిలదీస్తూ వైఎస్‌ జగన్‌ ‘ఎక్స్‌’లో తన ఖాతాలో సోమవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. 
ప్రజల ప్రాణాలు పోతున్నాయ్‌ 

⇒  ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్విసులకు చంద్రబాబు ప్రభుత్వం ఉరి వేస్తోంది. నిండు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచి్చంది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మృతి చెందింది.  

⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అంబులెన్స్‌లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలనే నిబంధన ఉంటే.. దాన్ని అధిగమిస్తూ 12–14 నిమిషాల్లోనే చేరుకునేవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే.. 16–17 నిమిషాల్లోనే వచ్చేవి. గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలనే నిబంధన ఉంటే దాన్ని కూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఇప్పుడు ఎందుకు చేరుకోవడం లేదు? ఫోన్‌ చేసినా ఎందుకు రావడంలేదు? ప్రభుత్వం అన్నది పనిచేస్తేనే కదా! కలెక్షన్ల మీద మినహా ప్రజల పట్ల ధ్యాస ఉంటే కదా?   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)