Breaking News

రాజధానిలో రెండో దశ భూ సమీకరణ.. వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Published on Thu, 01/08/2026 - 15:52

సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో తీసుకున్న భూమినే అభివృద్ది చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని వైఎస్‌​ జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్నది పిచ్చి పని అంటూ మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ఈ సందర్బంగా వైఎస్‌ జగన్‌..‘రాజధాని పేరుతో తొలి విడతలో 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమి అభివృద్దికే లక్ష కోట్లు అవసరమని చంద్రబాబు చెప్పారు. అది కూడా కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీరు లాంటి మౌళిక సదుపాయాలకే ఖర్చు చేశారు. ఆ లక్ష కోట్లు ఎప్పుడు వస్తాయో? ఎలా వస్తాయో తెలియదు. అప్పట్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.

చంద్రబాబు చర్యలతో భూములు ఇచ్చిన రైతులు బోరుమంటున్నారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకా రెండో దశ పేరుతో భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. మరో 50 వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు?. ఈ లక్ష ఎకరాల్లో మౌళిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఈ డబ్బంతా ఎక్కడ నుంచి తెస్తారు?. తాను, తన బినామీలు దోచుకోవటానికే చంద్రబాబు భూములు సేకరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

రెండో విడత భూసేకరణపై వైఎస్.జగన్ ఆగ్రహం

ఇది కూడా చదవండి: క్రిడెట్‌ చోరికి బాబు పడరాని పాట్లు: వైఎస్‌ జగన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)