Breaking News

జోగి రమేష్‌ అరెస్టు ముమ్మాటికీ అక్రమమే

Published on Mon, 11/03/2025 - 05:16

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి జోగి రమేష్‌ అక్రమ అరెస్టును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి.. దాని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ తమ పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్‌ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. బాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..  

⇒ ‘చంద్రబాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగి రమేష్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.  

⇒ గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు.. మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే.  

⇒ మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అమ్మేది మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్‌ షాపుల్లో.. మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టు షాపులు, పరి్మట్‌ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీ వారు, అమ్మేదీ మీ వారే.. కానీ బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని.  

⇒ నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతుల గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. 

జోగి అరెస్ట్ పై YS జగన్ ఫైర్

నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది చంద్రబాబు గారూ.. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్‌ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం!?.  

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)