Breaking News

భోగాపురం.. భూసేకరణ నుంచి నిర్మాణం వరకు ఇలా..

Published on Fri, 07/31/2026 - 09:14

భోగాపురం విమానాశ్రయం గురించిన అసలు వాస్తవాలు..

2023 మే 3: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి కార్యరూపం తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. దీనికోసం త్రిముఖ వ్యూహం అనుసరించారు. ఇక్కడ 2,751 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయించారు. మరోవైపు రైతులకు తగిన నష్టపరిహారం, నిర్వాసితులకు పునరావాసం విషయంలో తన ఉదారతను చాటుతూ వారిని ఒప్పించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పిటిషన్లన్నీ పరిష్కారమయ్యేలా చొరవ చూపించారు.

అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను తరచుగా సంప్రదిస్తూ విమానాశ్రయానికి అవసరమైన అనుమతులన్నీ సాధించారు. అలా అడ్డంకులన్నీ అధిగమించడానికి, అనుమతులన్నీ తేవడానికి నాలుగేళ్ల కాలం పట్టింది. ఇక మార్గం సుగమమైన నేపథ్యంలో రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసి, మూడో ఏట పూర్తిస్థాయిలో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను నిర్వహించాలనేది లక్ష్యం. ఈ క్రమంలోనే 2023 మే నెల 3వ తేదీన నాటి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా భోగాపురం విమానాశ్రయ ఊహాచిత్రం విడుదల చేశారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల పాలనాకాలంలో చేసిదేమిటో, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సాధించిందేమిటో రికార్డు ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. కనీసం ఏ భూమిలో వేస్తున్నామో చూడకుండా శిలాఫలకం వేసేసి టెంకాయ కొట్టే మమా అనిపించిన చంద్రబాబుదే ఘనత అంటూ డబ్బా కొట్టుకోవడం వారికే చెల్లిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుత విశాఖ విమానాశ్రయాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్పు చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో భోగాపురం వద్ద విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదన 2015 సంవత్సరంలో తెరపైకి వచ్చింది.

గత టీడీపీ ప్రభుత్వం భూసేకరణకు బీజం వేసింది. 15వేల ఎకరాలు సేకరిస్తామనడంతో భోగాపురం మండల రైతులు ఆందోళనలకు దిగారు. దీంతో ఐదు వేల ఎకరాలకు దిగొచ్చింది. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ప్రకటించడం, అసైన్డ్‌ భూములకు విస్మరించడంతో 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. అడ్డదిడ్డంగా తలపెట్టిన భూసేకరణను సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఏమీ పూర్తి చేయలేదు. ఏదిఏమైనా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత తనదేనని చాటుకోవాలని ప్రచారయావతో చంద్రబాబు 2019 ఫిబ్రవరి 14వ తేదీన హడావుడిగా శంకుస్థాపన చేయడం అప్పట్లో విమర్శలకు దారితీసింది.

ఫలించిన జగన్‌ శ్రమ...
విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని నిర్ణయించారు. పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ అందించారు. అసైన్డ్‌ భూములకు కూడా జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై జగన్ మాస్టర్ ప్లాన్

పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావు, బడ్డకొండ అప్పలనాయుడు, భోగాపురం మండల నాయకుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి తదితరులు జరిపిన చర్చలతో చాలామంది రైతులు సానుకూలంగా స్పందించారు. కోర్టుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగిలిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌ పరిష్కరించాయి. నిర్వాసితులైన నాలుగు గ్రామాల్లోని 404 కుటుంబాలకు అత్యుత్తమమైన పునరావాస ప్యాకేజీని నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించింది. దాదాపు రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను వారి కోసం నిర్మించింది.

అత్యాధునికంగా నిర్మాణం...
దాదాపు రూ.790 కోట్ల ఖర్చుతో సేకరించిన 2,750 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు బదలాయించింది. అందులో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 2,203 ఎకరాలను నోటిఫై చేస్తూ నాటి జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజాం ప్రాంత వాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావుకు చెందిన జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.

దాదాపు రూ.790 కోట్ల ఖర్చుతో సేకరించిన 2,750 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు బదలాయించింది. అందులో విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 2,203 ఎకరాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. రాజాం ప్రాంత వాసి, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావుకు చెందిన జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)