Breaking News

మెడికల్ కాలేజీల విషయంలో పాపం మూట కట్టుకుంటున్న బాబు సర్కార్‌

Published on Mon, 09/22/2025 - 09:22

సాక్షి, వెలగపూడి: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమ సంఘాలు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరోవైపు.. రాజకీయంగానూ వైఎస్సార్సీపీ తమ ఆందోళనలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో.. చట్ట సభలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతోంది. 

మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై అసెంబ్లీలో చర్చకు వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈ అంశంపై ఇంతకు ముందు షార్ట్‌ డిస్కషన్‌కు ఒప్పుకుంది. ఈ క్రమంలో ఇవాళ శాసన మండలిలో ఎలాగైనా చర్చ జరిగేలా చూడాలని వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోంది. తక్షణమే ఈ అంశంపై చర్చించాలని సోమవారం మండలి చైర్మన్‌కు వాయిదా తీర్మానం అందజేసింది కూడా. అయితే.. ఈ వాయిదా తీర్మాన్ని చైర్మన్‌ తిరస్కరించడంతో.. ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. 

నల్ల కండువాలతో మండలిపై శాసనమండలికి హాజరైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు.. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ‘‘ఈరోజు చర్చ జరుపుతాం అన్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పాటించరు?. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు కావాల్సిందే’’ అని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. తక్షణం చర్చ జరగాలి అంటూ మండలి చైర్మన్‌ పోడియం చుట్టూ చేరి వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ పట్టు వీడకపోవడంతో ఆందోళన నడుమ.. చైర్మన్‌ మండలిని కాసేపు వాయిదా వేశారు.

మండలి బయట ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పాపం మూట కట్టుకుంటోంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను ఆపాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నా చంద్రబాబుకు చెవికి ఎక్కటం లేదు. ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తే ఆ ప్రభుత్వాలనే జనం కూల్చేసిన సంఘటనలు ఉన్నాయి. తమ తాబేదార్లకి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దీనిపై తిరుగుబాటు చేయబోతున్నారు. వైద్యం అందుబాటులో లేక జనం ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా?. 17 కాలేజీలను ప్రభుత్వ పరంలోనే నడపాలి అని డిమాండ్‌ చేశారు.

అంతకు ముందు.. సోమవారం ఉదయం శాసనమండలి ప్రారంభానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. నల్లకండువాలతో, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ముందుకు సాగారు. ‘‘కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఆలోచిస్తోంది. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు రోడ్డుపాలు చేస్తున్నారు. ప్రజల కోసం ఎందాకైనా పోరాటం చేస్తాం’’ అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా అన్నారు. 

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)