Breaking News

పోస్టాఫీసులకు పోటెత్తుతున్న మహిళలు

Published on Tue, 11/26/2024 - 05:31

అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లా­లో­ని ప్రధాన పోస్టాఫీసులన్నీ వేలాదిగా తరలివస్తున్న మహిళలతో కిటకిటలాడుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన మహిళలందరి వ్యక్తిగత ఖాతాల్లో సీఎం చంద్రబాబు రూ.1,500 జమ చేస్తారన్న విస్తృత ప్రచారంతో మహిళలంతా పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనంతపురం, హిందూపురంలో హెడ్‌ పోస్టాఫీసులు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మహిళలు ఐపీపీబీ ఖాతాల కోసం చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం 5 గంటల నుంచే క్యూ కడుతుండటంతో హెడ్‌ పోస్టా­ఫీసులు జాతరను తలపిస్తున్నాయి. నెల రోజు­లుగా మహిళలు పోస్టాఫీసులకు వెళ్తున్నప్పటికీ.. నాలుగు రోజుల నుంచి వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది. సోమవారం వేలాదిగా మహిళలు తరలి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 

సూపర్‌ సిక్స్‌ పథకాల కోసమంటూ..
టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచి్చన హామీల మేరకు సూపర్‌సిక్స్‌ పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతాయంటూ కూటమి నేతలు పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లో రూ.1,500 జమ చేస్తారన్న ప్రచారంతో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొందరు మహిళలైతే చంటి బిడ్డలను చంకన వేసుకుని వస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోస్టల్‌ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. తొక్కిసలాట నేపథ్యంలో కొందరు ఊపిరి ఆడక అల్లాడిపోయారు. ఏమవుతుందోనన్న ఆందోళన అందరిలో కనిపించింది. పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులంతా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో కూడా అంతుబట్టడం లేదు.

అసలు సంగతి ఏమిటంటే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటికే ఐపీపీబీ ఖాతాలు గల లబ్ధిదారులు కొత్తగా ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదు. అయితే, ఐపీపీబీ ఖాతాలు కలిగి ఆధార్‌ లింక్‌ అయినంత మాత్రా­నా డబ్బు జమ కాదు. కచ్చితంగా ఆధార్‌ సీడింగ్‌ అయి ఉండాలి. బ్యాంకర్లు ఖాతాలకు ఆధార్‌ లింక్‌ చేస్తున్నా.. సీడింగ్‌ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా చాలామంది మహి­ళలు పోస్టల్‌ శాఖ ఇచ్చే ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటివరకు బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ సీడింగ్‌ కానివారు అనంతపురం జిల్లాలో సుమారు 3 లక్షలకు పైబడి ఉన్నట్టు సమాచారం.

బ్యాంకుల్లో ఆధార్‌ సీడింగ్‌ కాని వారు ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు వస్తుండగా.. ఆధార్‌ లింకేజీ, సీడింగ్‌ అయిన వారు కూడా ఐపీపీబీ ఖాతాల కోసం పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. మహిళలకు రూ.1,500 చొప్పున ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారు, అందుకోసం మహిళలు ఏం చేయాలి, ఇప్పటికే బ్యాంక్‌ ఖాతాలున్న మహిళలు ఏంచేయాలి, ఖాతాలు లేనివారు ఏ పోస్టాఫీసుకు లేదా ఏ బ్యాంకును సంప్రదించాలనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)