Breaking News

యూటర్న్‌ బాబు.. వాలంటీర్ల వినూత్న నిరసన

Published on Sat, 01/04/2025 - 13:54

సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్‌పై వాలంటీర్ల(Volunteers) పోరాటం కొనసాగుతోంది. తాజాగా విజయవాడ(Vijayawada)లో వాలంటీర్ల నిరసన ఉధృతంగా మారింది. రోడ్డుపై వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ యూటర్న్‌ విధానానికి వ్యతిరేకంగా బ్యాక్‌ వాక్‌ చేశారు. ఈ సందర్భంగా బాబు వచ్చారు.. జాబ్‌ తీశారంటూ నినాదాలు చేశారు. అలాగే, పెండింగ్‌ జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఏపీలో వాలంటీర్ల(Volunteers) పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యత ఇస్తామని, వేతనాన్ని కూడా పెంచుతామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో కూటమి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. వాలంటీర​్‌ వ్యవస్థను కొనసాగించి నెలకు రూ.10వేలు జీతం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

ఇక, విశాఖలోనూ వాలంటీర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల్లో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగిలించాలని వాలంటీర్లు డిమాండ్‌ చేస్తూ నిరనసలు చేపట్టారు. చంద్రబాబు సర్కార్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే అమరావతిలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)