Breaking News

అప్పటిదాకా బాబు, పవన్‌లను నమ్మం: విశాఖ ఉక్కు కార్మికులు

Published on Fri, 01/17/2025 - 12:11

విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకుండా అటు కేంద్రం నాన్చుతోంది. మరోవైపు  ఇటు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగబోదంటూ తెర వెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ‘‘విశాఖ ఉక్కుకు ప్యాకేజీ’’ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి.

ప్యాకేజీ అనేది కంటి తుడుపు చర్య. అది శాశ్వత పరిష్కారం ఎంత మాత్రం కాదు. ఇచ్చిన ప్యాకేజీ రెండు మూడు నెలలకు మించి సరిపోదు. ప్యాకేజీలతో ఒరిగేదేం లేదు. స్టీల్ ప్లాంట్(Steel Plant) బతకాలంటే సెయిల్ లో విలీనం ఒక్కటే మార్గమని సూచిస్తున్నాయి. అలాగే.. స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనుల కేటాయించాలన్న డిమాండ్‌ను మరోసారి ప్రస్తావించాయి.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ(Steel Plant Privatization) జరగదని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకోవాలని స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ జరగదని హామీ ఇస్తేనే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను నమ్ముతాం అని కార్మికులు చెబుతుండడం గమనార్హం.

సాక్షి టీవీతో ఉక్కు పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ.. ముడి సరుకు కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ప్యాకేజీతో కొత్తగా స్టీల్ ప్లాంట్ కు ఒరిగేది లేదు. కార్పొరేట్ల ఒత్తిడి మేరకే..ప్యాకేజి ప్రకటించారు. ప్యాకేజీ మొత్తం బకాయిలకే పోతుంది.

.. శాశ్వత పరిష్కారం చూపే వరకూ మా పోరాటం ఆగదు. ప్రజల్లో మమ్మల్ని చులకన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతీసారి డబ్బులు ఇవ్వలేమని చంద్రబాబు చెప్పారు. మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు విలీనం చెయ్యండి. మాకు అప్పు అవసరం లేదు. ఉన్న అప్పులను ఈక్విటీగా మార్చాలి. సెయిల్ లో విలీనం ఒక్కటే పరిష్కార మార్గం. అలాగే సొంత గనులు కేటాయించాలి అని ఉక్కు పోరాట కమిటీ నేతలు అంటున్నారు. 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)